యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా

రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో ని గాంధీ విగ్రహం దగ్గర నుండి ర్యాలీ నిర్వహించి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్ జెండా ఎగరడం జరిగింది యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు
ఉద్యోగ నోటిఫికేషన్ లు మరియు నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ఖాళీగా ఉన్నా పోస్టులను భర్తీ చేయకపోవడం వలన రాష్ట్రంలో ఉన్న యువత చాలా నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక దళిత సోదరుల అందరికీ దళితబంథు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనం పల్లి ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోట్ల సాయిబాబా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాల్వేరు అశోక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాపురం ప్రవీణ్, యువజన కాంగ్రెస్ మాజీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిరియాల మల్లేష్, పట్టణ అధ్యక్షులు బాసాని రాజు, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు మోటె క్రాంతి,కల్లూరు నరేష్, రేపాక రమేష్, గురజాల మహేష్ రెడ్డి, గోగు హరిప్రసాద్, రేఖ సైదులు,చల్ల సుధీర్, దండుగుల శేఖర్ గజారాజు సాయి కుమార్, నకిరేకంటి నర్సి పైల్వాన్, పరశురాం, మహేశ్వరం అశోక్,రాజు,బైకని నరేష్,సాయితేజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *