-మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు.
-జనగామ జిల్లా ప్రజలకు అభినందనలు.
-మెడికల్ కాలేజీకి అనుమతితో జనగామలో సంబరాలు.
-జనగామ ప్రజల తరుపున ఎమ్మెల్సీ పోచంపల్లి కృతజ్ఞతలు.
-తెలంగాణలో ఆరోగ్య విప్లవం.
– ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం.
– ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయం.
హైదరబాద్,నేటిధాత్రి:
జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుమతులు మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు జిల్లా ప్రజల తరుపున ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేటిధాత్రి ప్రతినిధితో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా మెరుగైన వైద్యసదుపాయల కల్పన, పేదలకు వైద్య భరోసా కల్గిందని అన్నారు. ఇప్పటికే జనగామలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో మొదలైన మాతా శిశు సంక్షేమ కేంద్రంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. కేసిఆర్ కిట్‌తో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు. జనగామలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఖరీదైన నేపధ్యంలో మాతాశిశు సంక్షేమ కేంద్రం అందుబాటులోకి వచ్చాక పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు. పైగా మామూలు కాన్పులు చేస్తూ, మహిళల ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం కాపాడుతోందని గుర్తు చేశారు. జనగామ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు గురించి కొన్ని దశాబ్ధాలుగా డిమాండ్ వుంది. కాని ఉమ్మడి పాలకులు తెలంగాణలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అసలు తెలంగాణలో ఆసుపత్రుల నిర్మాణమే చేపట్టకుండా, తెలంగాణకు వైద్యం అందుకుండా చేశారు. ప్రజలకు ప్రైవేటు వైద్యమే దిక్కు చేశారు. కాని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో వైద్య సదుపాయలు విసృతంగా పెంచి, పేదల ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నాడు. తెలంగాణ రాకపోతే తెలంగాణలో జిల్లాకో వైద్య కళాశాల చూసే అవకాశమేవుండకపోయేది. దేశంలోనై వైద్యవిప్లవం సృష్టించిన రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెబుతున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుతో ఖరీదైన వైద్యంతోపాటు, అత్యవసర సేవలు కూడా ఉచితంగా వైద్య కళాశాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటి వరకు ఏదైనా సీరియస్ కండీషన్ కేసులను అటు వరంగల్‌కు గాని,ఇటు హైదరాబాద్‌కు గాని వెళ్లాల్సిన పరిసి ్ధతి వుండేది. పేదలకు ఎంతో ఖర్చుతో పాటు ప్రాణాలకు కూడా భరోసా వుండేది కాదు. ఇప్పుడు సకాలంలో సీరియస్ కేసులకు కూడా ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాల ఏర్పాటుతో జనగామ జిల్లా పరిసర ప్రాంతాలైన సుమారు 300 గ్రామాలకు పైగా ఈ వైద్య సేవలు వేగంగా అందుకునే అవకాశం వుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో పెద్దఎత్తున వైద్య విప్లవం సృష్టిస్తున్నారని పోచంపల్లి కొనియాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో వైద్య కళాశాల ఏర్పాటు. వరంగల్‌లో సుమారు 2500 పడకల ఆసుపత్రి నిర్మాణం. హైదారాబాద్ చుట్టుపక్కల నాలుగు వైపుల నాలుగు అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక పల్లెలతోపాటు,పట్ణణాలన్నీంటిలిలో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వవైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.