మహా ధర్నాను జయప్రదం చేయండి

టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ పిలుపు…

మహబూబ్ నగర్, నేటిధాత్రి: హైద్రాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర నేడు తలపెట్టిన మహా ధర్నాను జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు హాజరై మహా ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు కలిసి మహాధర్నా ను నిర్వహిస్తున్నారని సాదిక్ పేర్కొన్నారు. దరిమిల మహాధర్నా లో ప్రజల సమస్యలు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు . ధరల పెరుగుదల. పొడు భూములు.వ్యవసాయ రైతాంగ సమస్యలపై. ధరణి సమస్యలు.భునిర్వాసితులు.కరోన వైరస్ నుండి చనిపోయిన వారి కుటుంబాల కోసం.పెట్రోల్ డీజిల్ ధరల పెంపు.తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. మహాధర్నా లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ జాతీయ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు పాల్గొంటారని సాదిక్ ఈ సంధర్బంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సాదిక్ తెలిపారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *