మరో పదేళ్లయినా ప్రజానాడి పట్టలేరు?

`తెలంగాణలో రెండు పార్టీలకు చోటే లేదు?

`అటు సఖ్యత లేదు…ఇటు బలం లేదు?

`జిల్లాల్లో నాయకత్వాలకే దిక్కు లేదు?

`ఒకరినొకరు కొట్లాటకే సమయం సరిపోవడం లేదు?

`కాంగ్రెస్‌ వి కాలక్షేప రాజకీయాలు?

`బిజెపిలో లుకలుకలు?

`కేంద్రంలో అధికారంలో వుండి రాష్ట్రానికి మేలు చేయలేరు?

`అధికారం యావ తప్ప ప్రజల ఆలోచనలకు దగ్గర కావడం లేదు!

`అభివృద్ధి అంతా గజ్వేల్‌ లోనే జరిగిందంటారు?

`గజ్వేల్‌ లో మేమే గెలుస్తామంటారు?

`సిద్దిపేట, సిరిసిల్లలకే నిధులన్నీ అంటారు?

`అక్కడ జెండా ఎగరేస్తామంటారు?

`పొంతన లేని ప్రకటనలు?

`ప్రజా క్షేత్రంలో దిక్కులేని ప్రతిపక్షాలు!

`సర్వేల పేరుతో సరికొత్త నాటకాలు?

`నిజాలు కనిపించకుండా కళ్లు మూసుకుంటున్నారు?

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండాపోయి ఇప్పటికే ఎనమిదేళ్లవుతోంది. తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోచుకుండాపోయింది. అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలులో దేశంలో ఎక్కడా లేని పధకాల అమలుతో ప్రజలు ప్రతిపక్షాలను నమ్మే పరిస్ధితి లేకుండాపోయింది. కనీసం ప్రజలు నమ్మేందుకు సరైన వివాదం చూపించే పరిస్దితి కూడా ప్రతిపక్షాలకు లేదు. తెలంగాణ వచ్చిన వెంటనే మూడు నుంచి ఆరు నెలల్లో మొత్తం తెలంగాణలో కరంటు సమస్య తీరిపోయింది. అంతగా తీరుతుందిన ఎవరూ కల గనలేదు. రోజులో కనీసం 12గంటలైనా కరంటు వస్తే చాలు అనుకున్న సందర్భం నుంచి నిరంతరం కరంటు సరఫరా అన్నది ఒక్క తెలంగాణలోనే… ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో తెచ్చిన తొలి విప్లవంగా చరిత్రలో నిలిచిపోనున్నది. ఇలా మొదలైన పనులు మరుసటి ఏడాది వరకు పరుగులు పెట్టాయి. తెలంగాణలో ఊహంచిన విధంగా ఎండల్లో కూడా చెరువులు కళకళలాడాయి. వాగులకు మళ్లీ నడకలు మొదలయ్యాయి. గోదావరి జలాలు తెలంగాణ పల్లెలకు పరుగుపరుగున వచ్చాయి. తొలి ఏడాదిలోనే సుమారు 15వేలకు పైగా మిషన్‌ కాకతీయతో పల్లెలకు మళ్లీ పూర్వవైభం తెచ్చారు. మూడేళ్లలో 45వేల చెరువులకు పూర్వ కళ, జళ కల వచ్చేంది. వానా కాలంలో వరద నీటికి నిండే చెరువులను సైతం గోదావరి జలాలతో నిండుతాయని ఏ తెలంగాణ వాది కూడా ఊహించలేదు. ఎందుకంటే చెరువులు నింపకం అన్నది ఒకటి వుంటుందని, అది తెలంగాణలో జరగుతుందని కలలో కూడా కనగనలేదు. అలా అనేక సంక్షేమ పధకాలు అమలౌతున్నాయి. పల్లెలు పచ్చని పైటను కప్పుకున్నాయి. పొలాలకు నిరంతరం నీరందుతోంది. నిరంతరం కరంటు అందుతోంది. రైతుకు దిగాలు లేకుండాపోయింది. పంటలు ఎండిపోతాయన్న దిగులు లేకుండా పోయింది. రైతుకు పెట్టుబడి అన్నది గతంలో ఎవరూ అమలు సంగతి పక్కన పెడితే ఆలోచన కూడా చేసింది లేదు. అన్ని వర్గాల ప్రజల్లో ఎంతో సంతోషం నిండివుంది. గతంలో ప్రతి పార్టీ రైతు గురించి మాట్లాడేదే గాని రైతుకు పెట్టుబడి భరోసా కల్పించింది లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం వైపు దేశమంతా చూస్తోంది. ఏ రాష్ట్రంలో లేని అనేక పథకాలతో దేశమంతా ఆకర్షిస్తోంది. 

మరి ఇలాంటి సమయంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రజలకు ప్రతిపక్షాలు చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అమలౌతున్న ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తామన్న మాట తప్ప మరో మాట చెప్పలేరు. అలాంటప్పుడు ప్రతిపక్షాలను నమ్మే పరిస్ధితి అసలే లేదు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఏదో చెప్పాలని చూసింది. కాని ప్రజలు నమ్మలేదు. ఆ పార్టీని విశ్వసించలేదు. అసలు తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటే లేదు. పైకి ఆ పార్టీలు గాయిగాయి చేస్తూ,అనవసర ప్రచారం చేసుకున్నా, ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. అసలు ఆ పార్టీలలో సంస్ధాగతంగా వారిలో వారికే సఖ్యత లేదు. బిజేపిలో తాజాగా అసలు గ్రూపులైన బండి సంజయ్‌, మంత్రి శ్రీనివాస్‌లలో ఒకరికి చెక్‌ పెట్టారు. మంత్రి శ్రీనివాస్‌కు పంజాబ్‌ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. కాని ఇప్పటికే బిజేపిలో అనేక పవర్‌ పాయింట్‌ కేంద్రాలున్నాయి. అవన్నీ బండి సంజయ్‌ దూకుడుకు ఎలా కళ్లెమేయాలని చూస్తున్నాయి. ఇదిలా వుంటే ఎంత సేపు బండి సంజయ్‌ ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టే రాజకీయం తప్ప, నిర్మాణాత్మక రాజకీయం అనుసరించడం లేదు. పైగా ఏది పడితే అదిమాట్లాడడం తప్ప, సైద్దాంతికతో, ఏదైనా సబ్జెక్ట్‌ మీద అవగాహనతో మాట్లాడిరది లేదు. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో వరదల సమయంలో బండ్లు కొట్టుకుపోయిన వారికి కొత్త బండ్లు ఇస్తామన్నాడు. ఇచ్చారా? తూచ్‌ అన్నారు…ఆ మధ్య కేంద్రమే మొత్తం ధాన్యం సేకరిస్తుందన్నాడు. డబ్బు దండోరా వేశాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దనుంచి వడ్లు కొనుగోలు చేయాలని ధర్నా చేశాడు. అంటే ఆయన కేంద్రాన్ని ఒప్పించి వడ్లు కొనుగోలు చేసే బాధ్యత నాది అని తప్పుకున్నాడు. ఇలాంటి నాయకులను మరోసారి ప్రజలు నమ్ముతారా? అంతే కాకుండా పార్టీలోనే అసలు నాయకత్వ సఖ్యతలేదు. అసలు బిజేపికి క్షేత్రస్ధాయిలో బలమే లేదు. ఓ వైపు దేశంలో ధరల మోత మోగుతోంది. బ్యాంకులు విధిగా ఇవ్వాల్సిన చెక్‌ బుక్‌ మీద కూడా జిఎస్సీ వేయడం అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వ పాలకులకే తెలియాలి. ఇది కూడా బిజేపి ఎలా సమర్ధించుకుంటుందో ఎన్నికల మందు ప్రజలు నిలదీస్తే ఏం సమాదానం చెబుతారు? ఆఖరుకు పెరుగు పాకెట్‌ మీద కూడా జిఎస్టీ వేసేశారు. పిల్లల నోట్‌ బుక్స్‌ మీద, ఆఖరుకు ఇంక్‌ మీద కూడా జిఎస్టీ విధించడం…పిల్లలు వాడుకునే షార్పునర్‌ను కూడా వదలకుండా వసూలు చేసి, మాకే ఓటు వేయండని ఎలా అడుగుతారన్నది త్వరలో తేలుతుంది. 

ఇక కాంగ్రెస్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఓ కుదుపు కుదిపేసినట్లే లెక్క. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి నాయకత్వంలో ఇష్టంగా పనిచేయలేకపోతున్నామని మీడియా ముఖంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పిపిసి పదవి అన్నది శాశ్వతం కాదు..ఎప్పుడైనా మారొచ్చు అంటూ కూడా ప్రకటించాడు. అసలు ఇప్పటికే పార్టీకి ప్రజల్లో వున్న బలం కాస్త హరించుకుపోతుంటే, ఎన్నికల దాకైనా సఖ్యత చూపలేకపోవడం ఆ పార్టీకి నేతల వ్యక్తిగత రాజకీయాలకు నిదర్శనం. ఇదిలా వుంటే అటు కాంగ్రెస్‌, ఇటు బిజేపి చేసే కొన్ని వింతైన వాదనలు ప్రజల చేత చీ అనిపించుకోకతప్పదనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఓడిస్తాం…మంత్రి కేటిఆర్‌ను ఓడిస్తాం…అంటూ, మరోవైపు తెలంగాణ సంపద అంతా అటు గజ్వెల్‌లో, ఇట సిద్దిపేట, సిరిసిల్లలో ఖర్చు చేస్తున్నారంటూ విమర్శిస్తుంటారు. అంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకన్నా, ఈ మూడు నియోకవర్గాలు ఎంతో పురగోతిలో వున్నాయని ప్రతిపక్షాలు ఒప్పుకున్నట్లే. మరి అలాంటి చోట అంత పెద్దఎత్తున అభివృద్ధి సాగిస్తే ప్రజలు ఆ నియోజకవర్గాలలో ప్రతిపక్షాలను ఆదిరిస్తారా? ఏ నమ్మకంతో ప్రతిపక్షాలకు ఓట్లేసారు. సుమారు 45 ఏండ్లపాటు కాంగ్రెస్‌ పరిపాలన చేసింది. ఆఖరుకు తెలంగాణ ఇవ్వడానికి ముందు కూడా కాంగ్రెస్సే పరిపాలన చేసింది. మరి గజ్వెల్‌ను రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి చేయలేదు. తెలంగాణకు ముందు, ఇప్పుడు ఒక్కసారి గజ్వెల్‌ను చూస్తే ఎవరికైనా కళ్లు జిగేల్‌ మనాల్సిందే…! పైగా గజ్వెల్‌ పరిసర ప్రాంతాలు కూడ ఎంత అభివృద్ది చెందాయో అందరికీ తెలుసు. అలాంటి నియోజకవర్గంలో ప్రతిపక్షాలను నమ్మి ప్రజలు చేజేతులా అభివృద్ధి నిరోధకలుగా మారుతారా? అంతటి అభివృద్ధిని కాదనుకొని తెలంగాణ సాధకులు, ప్రగతి రథసారధుకుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఓడిస్తామని ప్రతిపక్షాలు పగటి కలలు గనడమే వాటి సంకుచిత రాజకీయానికి నిదర్శనం. ఆరేళ్ల పాటు మంతి పదవిలో కొనసాగినా, కనీసం డబుల్‌ బెడ్‌ రూంలు కూడా పూర్తి చేయని ఈటెల రాజేందర్‌ను గజ్వెల్‌ ప్రజలు నమ్ముతారనుకోవడం హాస్యాస్పదం కాదా? ఇదే దారిలో కాంగ్రెస్‌ కూడా పనికి రాని వ్యాఖ్యలు చేస్తూ పొద్దు బుచ్చుకుంటోంది. సరిగ్గా ఏడాది కాలంలో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. ఇప్పటికీ ఏ నియోజక వర్గంలో ఎవరు నాయకులో ఆ పార్టీలే తేల్చలేకపోతున్నాయి. కనీసం తమ నాయకులు వీళ్లని చెప్పుకోలేకపోతున్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేసేందుకు అవసరమైన నాయకులే లేరు. కాని మేక పోతు గాంభీర్యం తప్ప ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి మాటలు లేవు…వారికి అధికారం అప్పగిస్తే కొత్తగా వాళ్లు చేసేదేమీ లేదు. నీళ్లు, నిధులు, నియామాకాలలో అన్నీంటినీ సమదృష్టితో పూర్తి చేస్తూ, అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం ఈసారే కాదు, మరో పదేళ్లు ప్రతిపక్షాలకు కష్టమే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*