నల్లబెల్లి-నేటిధాత్రి: మండల కేంద్రంలోని వైన్ షాప్ నుండి గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న షాపు యజమాని లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైన్ షాపుల నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా వైన్ షాపు యజమానులు మద్యం ప్రియులకు కాదని అధిక రేట్లకు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.దీంతో గ్రామాలలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ జరుగుతున్నది. గ్రామాలల్లో బెల్టు దుకాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇదేమి పట్టించుకోని ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఒకవైపు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బెల్టుషాపు నిర్వహణ పట్ల కరోనా రహిత జిల్లాకు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని మహిళా సంఘాల నాయకులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.