పై నుంచే మొదలు` ప్రక్షాళన షురూ!

నేటిధాత్రి వరస కథనాల ఎఫెక్ట్‌

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవకతవకలపై సిఎం. సీరియస్‌?

పెద్ద ఎత్తున అందినట్లు తెలుస్తున్న పిర్యాధులు?

కమీషనర్‌ శేషాద్రి మౌనం వెనక అనుమానాలు?

అంత జరుగుతున్నా ఎందుకు పట్టనట్లున్నారన్నదానిపై ఆరా?

శేషాద్రి బదిలితోనే అసలు వ్యహారం మొదలు?

రాహుల్‌ బొజ్జా రాకతో అవినీతి పరుల గుండెల్లో గుబులు?

నిజాయితీకి ప్రతిరూపంగా రాహుల్‌బొజ్జాకు పేరు?

అవినీతిని సహించరు? ఎంతటివారైనా ఉపేక్షించరు?

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌పై సిఎంకు చేరిన సామాజిక కార్యకర్తల పిర్యాధు లేఖలు?

అవినీతి అధికారుల ఏరివేతలకు శ్రీకారం?

గేమ్స్‌ స్టార్ట్‌ నౌ…అంటున్న పై స్ధాయి అధికారులు?

మంచి మీద చెడు ఎప్పుడూ విజయం సాధించలేదు. తాత్కాలికంగా చెడు తనను తాను రక్షించుకుంటున్నట్లు కలలు గన్నా అవి నిజం కావు…ఆ కలలు కాపాడవు. ఆ ప్రచారం పుట్ట పగలక మానదు. నిజమెప్పుడూ అబద్దపు ముసుగును నిప్పుతో దహించేస్తూనే వుంటుంది. చెడును దోషిగా నిలబెడుతూనే వుంటుంది. . చెడు మార్గం అన్నది ఎప్పటికైనా ముప్పే….అది తప్పే అని తెలిసిన కొందరు ఉద్యోగులైన ఉన్నత విద్యావంతులు కూడా అదే దారిలో నడవడం విడ్డూరం. సమాజానికి మంచి చెప్పి, మంచి చేయాల్సిన స్ధానంలో వున్నవాళ్లే అవినీతికి అక్రమాలకు పాల్పడడం చట్ట ప్రకారం నేరమే కాదు, నైతికంగా పాపం కూడా…? అలాంటి నమ్మకాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. తమకు తామే గొప్ప అనుకునేంత దౌర్భాగ్యం నింపుకున్నవాళ్లే అన్యాయాలకు తెగబడుతుంటారు. అలా అక్రమాలు ఆపకుండా, సామాన్యలను అన్యాయాలకు గురిచేసేవారి ఏనాటికైనా పాపం పండకపోదు. తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలిసికూడా… శిక్ష పడ్డప్పుడు కదా? అన్నంత నీతిలేని తనం, నికృష్టతనం నింపుకుంటున్నారు. ఆ అవినీతి అధికారులు చుక్కలు చూసే కాలం త్వరలో రానున్నది. తెలిసి తెలిసి తప్పులు ఎందుకు చేశామా? పేదలను ఎందుకు పీల్చుకుతిన్నామా? అవినీతికి ఎందుకు పాల్పడ్డామా? అని మధనపడాల్సిన రోజులు రాకమానవు. తప్పులు చేస్తూ కూడా కొందరు దర్జా వెలగబెడుతున్నారు. వారు చేసిన తప్పులు రుజువై ఉద్యోగాలు కోల్పోయి, పది మందిలో తలెత్తుకోలేని రోజులు వస్తాయని తెలిసి కూడా తప్పులు చేస్తున్నవారిని ఉపేక్షించొద్దు. వారిపై చర్యలకు ఉపక్రమించకుండా వుండొద్దు. ఇదే సగటు వ్యక్తి కోరుకునేది. అవినీతి కూపంలో కూరుకుపోయిన శాఖలు కొన్ని వున్నాయి. ఈ విషయం సాక్ష్యాత్తు ఈ మధ్యే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ కూడా వెల్లడిరచడం జరిగింది. ప్రజల్లో ఆయా శాఖలపై అసహనం పెరిగిపోతోందన్న విషయం కూడా ఆయన వెలుబుచ్చారు. అలాంటి శాఖల్లో అడ్డూ అదుపు లేకుండా, విచ్చలవిడి తనంతో సంపాదనకు ఎగబడిన స్టాంఫ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ కూడా వుంది. అందులోనూ కొంత మంది నిజాయితీ కలిగిన ఉద్యోగులున్నారు. 

                           కాని కొందరు ఉన్నత విద్యావంతులుగా సమాజ సేవ, సామాజిక సేవ ముసుగును వేసుకున్న అత్యంత అవినీతి పరులు కూడా వున్నారు. రాష్ట్ర స్ధాయి పేరు ప్రఖ్యాతుల ముసుగులో కూడా అవినీతిని పాల్పడుతూ అడ్డంగా సంపాదించుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారు. అలాంటివారికి ఇక చెక్‌ పడే సమసయం ఆసన్నమైంది. అవినీతిపై అక్షర సమారం సాగిస్తున్న నేటిధాత్రి కృషి ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి తంతును చీల్చి చెండాడుతూ నేటిధాత్రి అక్షరయాగం చేస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లాల వారిగా జరుగుతున్న అక్రమాలపై అక్షర సాక్ష్యాలతో తప్పులను అక్షర బద్దం చేస్తోంది. పుంఖాను పుంఖాలుగా ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అనేక కథనాలు ప్రచురించింది. వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిచింది. వివరాలు ముఖ్యమంత్రి దాకా చేరవేసింది. ఆ శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తాడనుకున్న కమీషనర్‌ శేషాద్రి మౌనంలో కూడా ఏదో మతలబు వుందన్న విషయం వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన కూడా జరుగుతున్న విషయాల మీద స్పందించకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నట్లు కూడా పై స్ధాయిలో చర్చ జోరుగానే సాగుతోంది. అందుకే ఆయనను బదిలీ చేసి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖకు రాహుల్‌ భొజ్జాకు అప్పగించారు. రాహుల్‌ బొజ్జాకు రాష్ట్ర స్ధాయి ఐఏఎస్‌లలో మంచి అధికారిగా గుర్తింపు వుంది. అవినీతిని అసలే సహించడన్న పేరుంది. ఆదర్శవంతమైన ఆయన కుటుంబ నేపధ్యం కూడా గొప్పది. తెలుగుజాతి గర్వించదగ్గది. అందుకే ఐఎఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జ అంటే ప్రత్యేకత వుంది. గతంలో వరంగల్‌, హైదరాబాద్‌ కలెక్టర్లుగా విధులు నిర్వర్తించారు. సిఎం. కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ, దళిత బంధు లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఆయన కనుసన్నల్లో అమలు జరుపుతున్నారు. అదనంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను కూడా సిఎం. అప్పగించారు. ఇక ఆయన రంగంలోకి దిగితే అవినీతి అధికారులకు చుక్కలే. ఈ విషయం ఇప్పటికే తెలిసిన ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. 

                 నేటిధాత్రి గత కొంత కాలం రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై విసృతమైన సమాచారంతో కూడిన కథనాల ప్రచురణ జరిగింది. దాంతో యంత్రాంగంలో కదలిక మొదలైంది. ఇటీవల మంత్రి కేటిఆర్‌ స్పందనతోనే అవినీతి అధికారులపై చర్యలు మొదలౌతాయన్న విషయాన్ని నేటిధాత్రి అదే రోజు చెప్పింది. అంతే కాదు ముఖ్యమంత్రి కార్యాయంతో పాటు సాక్ష్యాత్తు సిఎం. కేసిఆర్‌ కూడా ఆయా శాఖలపై దృష్టిపెట్టాలని లేకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని సూచించినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా తెలుస్తోంది. అందుకే సిఎం వెంటనే కొన్ని శాఖలకు సంబంధించిన కమీషనర్ల బదిలీలు చేపట్టినట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల బాగోతాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. పైగా ములుగు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అడ్డాగా చేసుకొని, సబ్‌ రిజిస్ట్రార్‌ కొంత మంది ప్రైవేటు సైన్యంతో మొగుళ్ల భద్రయ్య అనే సామాజక కార్యకర్త మీద దాడి చేయడం వంటి విషయాలన్నీ సిఎం దాకా వెళ్లాయి. పైగా ఆయన హ్యూమన్‌ రెట్స్‌ కమీషన్‌ను ఆశ్రయించేదాకా అధికారయంత్రాంగం కదలకపోవడంపై కూడా సిఎం సీరియన్‌ అయినట్లు సమాచారం. అందుకే అవినీతి పెద్దఎత్తున పెరిగిపోతున్న శాఖలు, నిర్లిప్తతతో వున్న శాఖాధిపతులను మార్చడం జరిగిందంటున్నారు. అందులో నేటిధాత్రి వరస కధనాలు తీవ్ర ప్రభావం చూపాయని సిఎం కార్యాలయ వర్గాలు ఇచ్చిన సమాచారం.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.