సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే చల్లా
పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ , పరకాల మండలం, నడికూడా మండలం, ఆత్మకూర్ మండలం, దామెర మండలాలకు చెందిన *41 మంది లబ్దిదారులకు 13,64,500.
రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను* పరకాల శాసన సభ్యులు *శ్రీ చల్లా ధర్మారెడ్డి* గారు హనుమకొండలోని అయన నివాసంలో అందజేశారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని వైద్య చికిత్సకు అందిస్తోందని తెలిపారు. ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. ప్రతి కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.
లబ్ధిదారుల వివరాలు:
పరకాల మున్సిపాలిటీ (7)- 1,98,500.
పరకాల మండలం(7)- 3,04,000.
నడికూడ మండలం(7)-2,55,000.
ఆత్మకూర్ మండలం(10)-2,68,500.
దామెర మండలం(10)- 3,38,500.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.