పేదల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం: ఎమ్మేల్యే చల్లా…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే చల్లా…

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే *చల్లా ధర్మారెడ్డి గారు*

అన్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూర్,దామెర, సంగెం, గీసుగోండ మండలాలతో పాటు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15,16 డివిజన్ల పరిధిలోని 47 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 14,13,000 రూపాయల విలువ చేసే చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో అందజేశారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ…పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. వేలాది మంది మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు.పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని , వారి బాగోగులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందన్నారు.

లబ్ధిదారుల వివరాలు…

పరకాల మున్సిపాలిటీ(2)- 72,000/-

పరకాల మండలం(7)- 2,15,000/-

నడికూడ మండలం(7)- 2,11,500/-

ఆత్మకూరు మండలం (3)- 1,06,000/-

దామేర మండలం(2)- 46,000/-

సంగెం మండలం (12)- 3,13,000/-

గీసుగొండ మండలం(6)- 2,22,000/-

గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ (8) – 2,27,500/-

ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *