నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణలక్ష్మి : ఎమ్మెల్యే చల్లా

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పేర్కొన్నారు.

మంగళవారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ,సంగెం తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15,16 డివిజన్ల పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు 20,02,320 రూపాయల షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో పంపిణీ చేశారు. 

అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబంలో పెద్ద కొడుకు పాత్రను పోషిస్తూ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,116 రూపాయలు అందజేస్తున్నారన్నారు.తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరికీ తెలంగాణ పథకాలు అమలు చేసి అన్ని రంగాల్లో భారత దేశాన్ని అభివృద్ధి పరచాలని కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారన్నారు. 24 గంటల విద్యుత్‌, తాగునీరు, సాగునీరు,దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమమే అజెండాగా, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాల కొనసాగిస్తున్నారన్నారు.రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.

 

 ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు,ఎంపిపిలు,కార్పొరేటర్లు, సర్పంచ్ లు,ఎంపీటీసీలు,మార్కెట్,కుడా & సొసైటీ చైర్మన్లు,డైరెక్టర్లు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *