
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
భారతదేశం మొత్తానికే కూచూరు గ్రామం గర్వకారణమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మ చారి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని కూచూర్ గ్రామంలో మేరా మట్టి, మేరాదేశ్ కార్యక్రమంలో భాగంగా క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురిష్కరించుకొని గ్రామంలోని ఆర్మీ జవాన్లకు, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్చర్ల అసెంబ్లీ సీనియర్ నాయకులు డాక్టర్.మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ గ్రామం నుండి సుమారు 80 మందికి పైగా యువకులను దేశ సేవలోకి
పంపడం గర్వకారణం అని అన్నారు.ఒక కుగ్రామం నుండి ఇంత పెద్ద ఎత్తున ఆర్మీలోకి వెళ్లడం విశేషమని ఆయన ఆర్మీ సైనికుల తల్లిదండ్రుల త్యాగనిరతిని కొనియాడారు.బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతు జవాన్లు అందరు తమ విద్యుక్త ధర్మాన్ని వీరోచితంగా నిర్వహిస్తున్నందుకే మనమంతా నేడు దేశంలో సుఖశాంతులతో జీవించగలుగుతున్నామని అన్నారు.బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమం జిల్లా కన్వీనర్ కృష్ణవర్ధన్ రెడ్డి, మాట్లాడుతు ఇలాంటి నేలను సందర్శించడం,వీరులను త్యాగదనులను కన్నవారిని కలుసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ఎక్స ఆర్మీ, కూచురు గ్రామ సర్పంచ్ రవీందర్ ,జడ్చర్ల అసెంబ్లీ కన్వీనర్ పులమోని నర్సింహులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు లోకిరేవు శ్రీను ,లక్ష్మీనారాయణ ,మండల అధ్యక్షులు గవిండ్ల రాజు , కన్మకల్ల ఆంజనేయులు ,మంత చిన్నయ్య, లింగం, ప్రశాంత్ రవి, రాజు, నాగరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.