దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo గురువారం దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎండీ. అబ్బాస్ హాజరయి మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో చేనేత వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నదని దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టే విధంగా జిఎస్టి నీ 12 శాతం పెంచడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన చేనేతపై 70 సంవత్సరాల కాలంలో ఎక్కడ వస్త్రాలపై సుంకo లేదని,ఈరోజు చేనేత పైన జిఎస్టి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరియు రాష్ట్రంలో బిజెపి నిరుద్యోగ సమస్యపైన నిరాహార దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఏడు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగులను తొలగించిన దుర్మార్గమైన చరిత్ర బిజెపి పార్టీదని విమర్శించారు. దేశంలోని రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

వెంటనే ఐకేపీ కొనుగోలు ద్వారా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి భవిష్యత్తులో కూడా రైతుల పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగం కేంద్ర ప్రభుత్వం పై సంవత్సరం కాలంపాటు పోరాటం చేసి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం జరిగిందని మరియు విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ధనవంతులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను మానుకొని ప్రజల కోసం పని చేయాలని లేనియెడల రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అర్, శశిధర్,జి.భాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎస్. నవీన, రుద్రారం సిపిఎం పార్టీ ఎంపీటీసీ కే.మంజులత,సిపిఎం పార్టీ దుబ్బాక మండల నాయకులు దేవయ్య,మహేందర్ రెడ్డి,కొంపల్లి భాస్కర్, బత్తుల రాజు, శంకర్,స్వామి,దేవయ్య, యాదవరెడ్డి,మోహన్ రెడ్డి,మానస,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *