తెరాసకు తిరుగులేదు! కేసిఆర్‌కు ఎదరు లేదు!!

ప్రతి పక్షాలకు బలం లేదు… యంత్రాంగం అంతకన్నా లేదు…

వారి ప్రచారంలో నిజం లేదు…వారికి నమ్మకమైన నాయకత్వం లేదు…


రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…

 


కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ అంతా డొల్ల?

బిజేపి ప్లీజ్‌..ప్లీజ్‌ మహానటన?

పార్టీలో నాయకుల మధ్యే సఖ్యత లేదు? 

ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో వారిలో క్లారిటీ లేదు?

ఎంత సేపు అధికారం యావ తప్ప, గెలిపిస్తే ఏం చెస్తారో చెప్పే బ్లూ ప్రింట్‌ లేదు…

అసలు ఇంతకీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగులేమిటి? ఆయన ఆలోచనలేమిటి? వ్యూహాలేమిటి? వేస్తున్న ఎత్తులేమిటి? ప్రతిపక్షాలను ఎలా చిత్తు చేయాలనుకుంటున్నారు? కొంత కాలంగా ఆయన రహస్యంగా సాగిస్తున్న మంతనాలేమిటి? ఇది సగటు వ్యక్తిలో మెదులుతున్న ఆలోచనలే కాదు…తమ పార్టీ పనులు గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీలు కూడ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ప్రశ్నలు.

ప్రతిపక్షాలు గతం కన్నా మిన్నగా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. అయినా కేసిఆర్‌ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. గతంలో ఉద్యమ కాలంలోనూ ఇదే వరస. కేసిఆర్‌ ఒక్కసారి మాట్లాడితే అది ఆరునెలలు చర్చ. ఆయన మౌనం వహిస్తే మరింత రచ్చ. అని చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా అదే దారిలో కేసిఆర్‌ నడుస్తున్నా, రెండు దశాబ్ధాలు గడుస్తున్నా కేసిఆర్‌ వ్యూహాలను అంచనా వేయడం ఎవరి వల్ల కావడం లేదు. మధ్య మధ్యలో కేసిఆర్‌ ఇచ్చే లీకులను ఆధారం చేసుకొని ప్రతిపక్షాలు మాట్లాడడం తప్ప, కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకునే విషయాలు ఏమీ వుండదు. అదే కేసిఆర్‌ గొప్పదనమని చెప్పకతప్పదు. ఇలాంటి విషయాలకొస్తే 2011 మార్చి 10న మిలియన్‌ మార్చ్‌ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమ కారులు, తెలంగాణరాష్ట్ర సమితి కార్యకర్తలు,నాయకులు హైదరాబాద్‌ నిండిపోయారు.

ట్యాంక్‌ బండ్‌ మీద రక్తం చిందినా పోలీసు దెబ్బలకు ఎదురొడ్డి వేలాది మంది ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నారు. ఉదయం పది గంటలకు పట్టుమని పది మంది లేని సమయం నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌ ఉద్యమ కారులతో నిండిపోయింది. నాడు హరీష్‌ రావు హుస్సేన్‌ సాగర్‌నుంచి బోటులో ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నారు. ఆ సమయంలో ట్యాంక్‌ బండ్‌మీద శ్రీకృష్ణదేవరాయ విగ్రహం కూల్చివేత, మీడియా ఓబి వ్యాన్లు తగలబడి పోవడం వంటివి జరిగాయి. 

                             తెలంగాణ ఉద్యమచరిత్రలో మిలియన్‌ మార్చి ఒక మైలు రాయిగా మిగిలిపోయింది. అయితే అలాంటి సందర్భం మరొకటి సృష్టించి సాగర హారం నిర్వహిస్తారని ఎవరూ ఊహించలేదు. మళ్లీ 2011 సెప్టెంబర్‌ 30 సాగరహారం నిర్వహించారు. నాటి ప్రభుత్వం ట్యాంక్‌ బండ్‌ మొత్తం పోలీసులతో నింపేస్తే, హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ సాగరహారం నిర్వహించారు. మిలియన్‌ మార్చి అయినంత సక్సెస్‌ సాగరహారం కాదని అందరూ అనుకున్నారు. కాని అంతకు మించి సాగరహారం నిర్వహించిన ఘనత కేసిఆర్‌ది. అంటే ఉద్యమమైనా, పాలనైనా కేసిఆర్‌ వేసే అడుగులను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. ఆయన వ్యూహాలు అర్ధం కాక, ఆయనను అర్ధం చేసుకోలేక, అంత ఓపిక లేక, రాజకీయాలను మాత్రమే ఎంచుకొని కేసిఆర్‌ను వదిలిపెట్టిపోయిన స్వార్ధ పరులు కూడా వున్నారు. కాని ఎక్కడా కేసిఆర్‌ పట్టు సడలలేదు. మరింత పట్టుదలగా ముందుకు సాగారు. అందుకే కేసిఆర్‌ ఏది చేసినా ఒక్కడిగానే సాగుతాడు. ఒక్కడిగానే ఆలోచిస్తాడు. ఒక్కడుగానే అమలు పర్చుతాడు. అందుకే ఆయనను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. 

                      ఇంతకీ కేసిఆర్‌ ముందస్తు ప్లాన్‌ చేసుకుంటున్నాడా? లేదా? అన్నదానిపై ప్రతిపక్షాల్లో సాగుతున్న తర్జన భర్జన అంతా ఇంకా కాదు. గతంలో ముందే లీకులు ఇచ్చి మరీ ప్రతిపక్షాలను కేసిఆర్‌ కోలుకోలేని దెబ్బకొట్టారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సరే గత ఎన్నికల్లో ఎంతో కట్టడి చేయగలిగారు. గతంలో ఏ నాయకుడికి రానంత, ఊహించనంత మెజార్టీలు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సొంతం చేసుకున్నారు. దీనంతటీకి కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలనపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. ఉద్యమ కాలంలో సైతం అంత మెజార్టీలు ఎవరూ సాధించలేదు. కాని ఒకసారి అధికారం కొనసాగించిన తర్వాత మరసటి ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలేకాదు, అల్టిమేట్‌ మెజార్టీ సాధించడం అన్నది కూడా సామాన్యమైన విషయం కాదు. అందుకే ప్రతిపక్షాలకు ఎటూ పాలుపోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నంత తీవ్రంగా వ్యతిరేకత ప్రజల్లో లేదు. చైతన్యం నింపుదామంటే ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు. తెలంగాణ ప్రజలకు పాఠాలు చెప్పడం వారికి సాధ్యం కాదు. అడుగులు ఎటు వేయాలో ప్రతిపక్షాలకు పాలుపోవడం లేదని కూడా తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఎక్కడైనా ప్రభుత్వం మీద పోరాటంతో ఆధిపత్యం ప్రదర్శించే పరిస్ధితులుంటాయి. కాని తెలంగాణలో భిన్నమైన పరిస్ధితులున్నాయి. ప్రతిపక్షాలు ఒకదానికొకటి నేనేంటే, నేనే అనిపించుకుంటే గాని తమ ఉనికిని నిరూపించుకోలేరు. ప్రతిపక్షాలకు ఇది సందిగ్ధ పరిస్ధితి. కాకపోతే అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఇది సంధి కాలం. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు అటు తిరిగి, ఇటు తిరిగి అధికార పార్టీ మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వుంది. ఎందుకంటే ప్రతిపక్షాలైన బిజేపి, కాంగ్రెస్‌లు ఎదగడానికి చేసే ఆరోపణలు అంతిమంతా అధికార పార్టీనే వేలెత్తిచూపుతాయి. దాన్ని గమనించుకొని టిఆర్‌ఎస్‌ అడుగులేయాల్సిన అవసరం వుంది.. 

                       ఎంత బలంగా వున్నా, బలమైన ఎదురుదాడికి టిఆర్‌ఎస్‌ సిద్ధం కావాలి. ప్రతిపక్షాలు ప్రతి విషయంలోనూ మాటల దాడి చేస్తాయి. వాటిని అనుక్షణం టిఆర్‌ఎస్‌ తిప్పికొట్టాలి. ప్రతిపక్షాలు ప్రతి నిమిషం బట్ట కాల్చి మీదేయాలని చూస్తాయి. దాన్ని తట్టుకుంటూ ఆ సెగను ప్రతిపక్షాల మీదకు టిఆర్‌ఎస్‌ మళ్లీంచేందుకు ప్రతి సందర్భంలోనూ సిద్ధంగా వుండాలి. లేకుంటే ప్రతిపక్షాలు చెప్పే విషయాలే ప్రజలు నమ్మే పరిస్ధితి రావొచ్చు. నిజాలకన్నా, అబద్దాలనే ఎవరైనా ముందు నమ్ముతారు. తెలంగాణలో ఇన్ని ప్రజా సంక్షేమ పధకాలు అమలౌతున్నా, ఎనమిదేళ్లుగా అధికారం కోసం ఎదరు చూస్తున్నవారు కొత్తగా పాలిస్తారేమో! అన్న ఆలోచనలు రావొచ్చు. అందువల్ల దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలౌతున్నాయన్నదానిని బలంగా టిఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాకపోతే గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలుకు దోహదం చేసినా, విఫలమైన పధకాల మీద ప్రతిపక్షాలు దృష్టిపెట్టే అవకాశం వుంది. అందువల్ల వాటిని అధిగమించేందుకు కూడా టిఆర్‌ఎస్‌ కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలి. నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్నికల తరుణం దగ్గరకొస్తున్న సమయంలో క్రియాశీలకంగా పనిచేయాల్సిన అసవరం వుంది. తెలంగాణలో బిజేపికి బలం లేదు. బలగం లేదు. కార్యకర్తల యంత్రాంగంలేదు. అందుకు అవసరమైన నాయకత్వం కూడా లేదు. పేరుకు చెప్పుకోవడానికి పట్టు మని పది మంది కూడా ఆ పార్టీలో బలమైన నేతలు లేరు. వాళ్లే పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వున్న ఆ కొద్ది మందైనా కార్యకర్తలు సోషల్‌ మీడియా వేధికగా పార్టీని విసృత ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అంతో ఇంతో క్షేత్రస్ధాయిలో బలంగానే వున్నది కాంగ్రెస్‌. కాని నాయకులే సరిగ్గా లేదు. అక్కడ కూడా డజన్‌ మంది ముఖ్యమంత్రులు కావాలనుకనేవారు తప్ప, పార్టీని గట్టెక్కించేవారు లేదు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేసే వారు లేదు. అందరూ మూకుమ్మడిగా ఏకమైనా, వారిని నమ్మేందుకు పెద్దగా ప్రజలు సుముఖంగా లేరు. ఇది ముందు తెరాస కార్యకర్తలు తెలుసుకుంటే చాలు…ప్రతిపక్షాల అసత్యాలు, అర్ధసత్యాలను తిప్పికొడితే చాలు… తెలంగానలో తెరాసకు తిరగులేదు. ఎదురులేదు…

Leave a Reply

Your email address will not be published.