తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు

తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలని, తెలంగాణ మాదిరిగానే దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసిన రవిచంద్ర, విజయలక్ష్మీ గార్లు

రవిచంద్రతో పాటు స్వామివారిని దర్శించుకున్న పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి శుక్రవారం ఉదయం కలియుగ ఇష్ట దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ విజయవంతం అయినట్లుగానే పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభలు, సమావేశాలన్నీ కూడా దిగ్విజయం కావాలని, తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించాలని కోరుతూ భగవంతున్ని వేడుకున్నారు.అలాగే మహానేత కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ మాదిరిగా యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.ఎంపీ రవిచంద్రతో పాటు పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు మంత్రోచ్ఛరణాల మధ్య అంక్షితలు వేసి రవిచంద్ర, విజయలక్ష్మీ గార్లను,ఇతర ఎంపీలను ఆశీర్వదించారు, శాలువాలతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published.