జిల్లా ఆసుపత్రికి మరో రూ.10 కోట్ల నిధులు విడుదల

అన్ని రకాలఅదనపు సౌకర్యాల కోసం జి.ఓ నిధులు విడుదల చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

ఇప్పటికే నర్సంపేట జిల్లా ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 58 కోట్లు విడుదల

మరో ఆరు నెలల్లో పూర్తి కానున్న ఆసుపత్రి నిర్మాణ పనులు

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట నియోజకవర్గం పేదోళ్లకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఇప్పటికే రూ. 58 కోట్లు విడుదల కాగా ప్రస్తుతం మరో 10 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక జీ ఓ ద్వారా నిధులు విడుదల చేసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పగించారు.దీంతో 200 పడకల పెద్దాసుపత్రి మరో 6 నెలలలో నిర్మాణ పనులు పూర్తికానున్నాయి.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ఉన్న నిరుపేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో మంత్రి హరీశ్ రావు సహకారంతో నర్సంపేట ప్రాంతానికి జిల్లా ఆసుపత్రి మంజూరు కావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న నర్సంపేట ఏరియా ఆసుపత్రిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అనుమతులు కూడా జారీ అయ్యాయని ,అందులో భాగంగా ఇటీవల కాలంలో నర్సంపేట జిల్లా ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 58 కోట్ల నిధులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంజూరు చేయగా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదనంగా కాంపౌండ్ వాల్, గ్రీనరీ, స్టాఫ్ క్వార్టర్, రోగుల అటెండెంట్ షేడ్, ఇంటర్నల్ సీసీ రోడ్ మరియు ఇతర సదుపాయాల కోసం మరో రూ. 10 కోట్ల నిధులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిందని వివరించారు.గతంలో నర్సంపేట ప్రాంత పర్యటనలో భాగంగా వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రజల తరపున అడిగిన నా కోరిక మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సీఎం కేసీఆర్ అనుమతితో నర్సంపేట జిల్లా ఆసుపత్రికి అదనంగా మరో రూ.10 కోట్ల నిధులను విడుదల అయినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నిర్మాణ పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులను మొదలుపెట్టి మరో 6 నెలల్లో అన్ని సౌకర్యాలతో నర్సంపేట జిల్లా ఆసుపత్రిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.