జగిత్యాల జిల్లా లో గాలివాన భీభత్సం….

మాదాపూర్ లో కుప్పకూలిన రైసుమిల్లు

కోటి రూపాయల ఆస్తినష్టం

జగిత్యాల
లో కూలిన భారీ బోర్డులు

తృటిలో తప్పిన ప్రమాదాలు

ఐకేపి సెంటర్లలో కొట్టుకుపోయిన వరిధాన్యం

తడిసి ముద్దయిన వడ్లు

నేలరాలిన మామిడి కాయలు

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి)

జగిత్యాల జిల్లాలో శనివారం సాయంత్రం
పట్టుమని 30నిమిషాలు కూడా కురవని గాలివాన నానా భీభత్సం సృష్టించింది. జిల్లా అంతటా రైతులను, ప్రజలను అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ బోర్డులు కుప్పకూలాయి. సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో తృటిలో ఘోర ప్రమాదాలు తప్పాయి. అలాగే మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలతో పాటు పరిసర గ్రామాల్లో కోటి రూపాలకు పైగా ఆస్తినష్టం జరిగేలా చేసిందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. శనివారం సాయంత్రం గాలివాన,
భారీగా వీచిన ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని అనేక గ్రామాల్లో మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మండలంలోని మాదాపూర్ శివార్లలో గల విఘ్నేశ్వర రైస్ మిల్లులో భారీగా వీచిన ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రేకుల షెడ్డు పూర్తిగా కుప్ప కూలి పోయింది. నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిసి పోవడంతో భారి నష్టం వాటిల్లింది.
అదే విధంగా వెంకటాపూర్ లో సింగిల్ విండో గోదాం రేకులు ఎగిరి పోయాయి.
నిల్వచేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దైపోయాయి.
జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లోని ఐకెపి సెంటర్లలో రైతుల వరి ధాన్యం తడిసి నీళ్లలో వరిధాన్యం కొట్టుపోయింది.
కొన్ని గ్రామాల్లో గాలులకు పేద ప్రజల రేకుల షెడ్డులు లేచిపోయాయి.
ప్రాణనష్టం జరుగకున్నా ఆస్తినష్టం జరుగడంతో జగిత్యాల జిల్లా రైతులు, ప్రజలు లబోదిబో మంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు కోట్లల్లో నష్టం వాటిల్లిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *