
చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పిస్తున్న నాయకులు
మరిపెడ /చిన్నగూడూరు నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడురూ మండల కేంద్రంలో దాశరథి ప్రాంగణంలో చాకలి ఎస్సీ సాధన సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పసనాది విజయ్ అధ్యక్షతన వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి దేశాగాని కృష్ణ, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, బి ఆర్ ఎస్ మండలం నాయకులు మన్నే చెన్నయ్య, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ వీరనారి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణం అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాచర్ల నవీన్, చాకలి ఎస్సీ సాధన సమితి మండల అధ్యక్షులు మాచర్ల దేవేందర్,ఎస్ యం, సి చైర్మన్ దాసరి నరేందర్, కేసముద్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిల్లి శ్రీరామలు, మాచర్ల వీరన్న,మాచర్ల రామచంద్రు, మాచర్ల సోమయ్య, మాచర్ల లాలయ్య, మాచర్ల రాములు, పాపమ్మ, ముత్తమ్మ. అంగన్వాడి ఉద్యోగులు,మన్నే జ్యోతి, సులోచన, సర్వర్ బి, వరలక్ష్మి, కవిత హెల్పర్లు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పించారు.