కారెక్కాలనుంది!

https://epaper.netidhatri.com/

` బిఆర్‌ఎస్‌ లో చేరాలనుంది!

`గులాబీ మీదకు మళ్లుతున్న మనసు.

` కాంగ్రెస్‌, బిజేపి నేతల ఆసక్తి

`బిఆర్‌ఎస్‌ సీనియర్లతో ప్రతిపక్ష నేతల సంప్రదింపులు.

`మాకు బిఫామ్‌ ఇస్తామంటే చేరడానికి సిద్ధం.

https://epaper.netidhatri.com/

` కాంగ్రెస్‌ లో భవిష్యత్తు కష్టమే.

` బిజేపి లో రాజకీయం శూన్యమే.

`తమను నమ్ముకున్న ప్రజల కోసం ఆలోచిస్తున్నాం.

` అవకాశమిస్తే రావాలనుకుంటున్నాం.

`ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నప్పుడు ప్రజల మార్పు కోరుకోరు.

`ప్రతిపక్షాలను తెలంగాణలో ఆదరించేలా లేరు.

`పిడికెడు మంది నాయకుల కొట్లాట ప్రజల కోసం కాదు.

`ప్రతిపక్షాల కొట్లాటకు ఎక్కడా ప్రజల సహకారం లేదు.

https://epaper.netidhatri.com/

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదు.

`తెలంగాణ లో అమలౌతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవు.

` కారును కాదని తెలంగాణ లో ప్రతిపక్షాలకు ఓట్లు పడేది లేదు.

`పదేళ్లయినా మా రాజకీయానికి భవిష్యత్తు కనిపించడం లేదు.

`గులాబీ గూటికి చేరితేనే మేలు.

`లేకుంటే రాజకీయాలు మానుకోడం కంటే మించింది లేదు.

“ఇదే చాలా మంది నేతల అంతర్మధనం.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

https://epaper.netidhatri.com/

కారెక్కాలని వుంది..ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని రాజకీయం చేసిన వున్నవాళ్లు. రాజకీయాలలో ఉద్దానాలు చూసిన వాళ్లు. అధికారం, ధర్పం చూపించిన వాళ్లు. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటో అర్థం కాకుండా అయోమయంలో పడిపోయిన వారు. పదేళ్ల కాలంగా ప్రజలకు దూరమైన వాళ్లు. ఇంకా కాంగ్రెస్‌ లో వుంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమౌతుందని గ్రహించిన వాళ్లు. అందులో వుండలేక, బైటకు రాలేక ఇంత కాలం సతమతమైన వాళ్లు. ఇక తప్పదని ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్లు. కారు వైపు చూస్తున్నారు. నిజానికి ఆ నాయకులు ఆనాడే కారెక్కితే బాగుండేది. కానీ అప్పుడు అహం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఇక కాంగ్రెస్‌ లో భవిష్యత్తు లేదనిపిస్తోంది. కాంగ్రెస్‌ లో వుండి ఇంకా చేతులు కాల్చుకోవడం కన్నా కారెక్కి షికార్లైనా కొడదనుకుంటున్నారు. గతంలో అధికారం, దర్పం చూసిన వాళ్లు. పదేళ్లుగా ప్రజల్లో లేకపోయే సరికి ఇంకా జనానికి దూరం కావడం ఇష్టం లేదు. చేతికి హాండిస్తే తప్ప కారుతో షేక్‌ హాండ్‌ కుదరదు. ఇదిలా వుంటే ఆ నాయకుల కాంగ్రెస్‌ ఇప్పుడు లేదు. గతంలో వాళ్ల హవా నడిచిన కాంగ్రెస్‌ కాదు. అది వేరు…ఇది వేరు. అప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కువుండే కాంగ్రెస్‌. ఇప్పుడు పదవుల పందేరంలో సీనియర్లను పక్కన పెడుతున్న కాంగ్రెస్‌. ఎలాగూ ఆ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు. పార్టీయే ప్రజల్లో లేదు. ప్రజల ఆదరణ అసలే లేదు. నాయకులుగా చెలామణి అవుతున్న వారిని ప్రజలే గుర్తించే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో అక్కడే వుండి పరువు పోగొట్టుకోవడం కన్నా, దూరం జరగడమే మేలనుకుంటున్నారు. ఎలాగూ తెలంగాణ ఉద్యమం లో కలిసి గొంతు కలపలేదు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేదు. ఇప్పుడైనా తెలంగాణ కు మేలు చేస్తున్న బిఆర్‌ఎస్‌ కు సపోర్ట్‌ చేయాలనుకుంటున్నారు. ఉద్యమ కాలం నాడు సహకరించని లోటును ఈ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నారు. కారెక్కాలని వుందన్న మనసులో మాటను బిఆర్‌ఎస్‌ నాయకుల చెవిలో వేస్తున్నారు. సమాచారం అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకువెళ్లాలలని సూచిస్తున్నారు. ఎప్పుడు సిఎం కేసిఆర్‌ నుంచి కబురొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేతలు కొందరు బిజేపి నుంచి కూడా చూస్తున్నారు. బిజేపిలో ఎలాగూ పెద్ద నాయకులం కాలేదు. కారుతోనైనా దశ మారుతుందేమో అని ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎంతకాలం కాంగ్రెస్‌ లో వున్నా భవిష్యత్తు కనిపించడం లేదు. తమను నమ్ముకున్న వారికి సాయపడే అవకాశం లేదు. ప్రజలకు దూరమైపోవడం ఇష్టం లేదు. ప్రజాసేవ చేయాలంటే కాంగ్రెస్‌ తో కలిసొచ్చేలా లేదు. బిజేపి భవిష్యత్తేమిటో ఆ పార్టీకే అర్థం కావడం లేదు. తెలంగాణ లో ప్రజల ఆదరణ కనిపించడం లేదు. అదరిస్తారనే నమ్మకం అసలే లేదు. కాలం కరిగిపోవడం తప్ప ఎదురుచూపులతో లాభం లేదు. ఇప్పటికైనా తెలివైన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయం కనుమరుగైపోతుందేమో అని మధనపడుతున్నారు. మనస్తాపం చెందుతున్నారు. మాకు బిఫామ్‌ ఇస్తామంటే చేరడానికి కారెక్కడానికి సిద్ధంగా వున్నామని కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ లో భవిష్యత్తు కష్టమే తెలిసిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. 

గులాబీ నేతలతో లాబీయింగ్‌ చేస్తున్నారు. 

 తమను నమ్ముకున్న ప్రజల కోసం ఆలోచిస్తున్నామని అంటున్నారు. అవకాశమిస్తే రావాలనుకుంటున్నాం. దేశంలో ఎక్కడా అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణలో మాత్రమే అమలౌతున్నాయి. తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచిపోయిన పథకాలవి. వాటిని కాదని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. అసలు తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాకుండా మరెవరు పాలకుడైనా ఈ అభివృద్ధిలో పది శాతం కూడా వుండేది కాదు. చెరువులు బాగుపడేవి కాదు. కాళేశ్వరం నిర్మాణం జరిగేది కాదు. నీటి పారుదల రంగం పరవళ్ళు తొక్కేది కాదు. సాగు విప్లవం చూసేవాళ్లం కాదు. కరంటు కష్టాలు ఇంకా అనుభవించే వాళ్లం అని నిన్నటి పాలకులైన కాంగ్రెస్‌ నాయకులే అంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నప్పుడు ప్రజల మార్పు కోరుకోరు. ప్రతిపక్షాలను తెలంగాణలో ఆదరించేలా లేరు. అసలు ప్రభుత్వం మీద కొట్లాడడానికి ఆస్కారమే లేదు. అవసరమే లేదు. కాకపోతే రాజకీయ మనుగడ కోసం మాత్రమే ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తోంది. పిడికెడు మంది నాయకుల కొట్లాట ప్రజల కోసం కాదు. ప్రతిపక్షాల కొట్లాటకు ఎక్కడా ప్రజల సహకారం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదు. కారును కాదని తెలంగాణ లో ప్రతిపక్షాలకు ఓట్లు పడేది లేదు. 

పదేళ్లయినా మా రాజకీయానికి భవిష్యత్తు కనిపించడం లేదు.

గులాబీ గూటికి చేరితేనే మేలు. లేకుంటే రాజకీయాలు మానుకోడం కంటే మించింది లేదు. ఇదే చాలా మంది నేతల అంతర్మధనం. దేశంలో తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణ అస్తిత్వం వేరు. అన్నింటినీ మించి కేసిఆర్‌ నాయకత్వం వేరు. ఆయన వేసే అడుగులు, ఎత్తులు ఎవరికీ అర్థం కావు. అంతు చిక్కవు. ఉద్యమ సమయంలోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో చారిత్రకమైనవి. సహజంగా ఒక నాయకుడు తీసుకున్న నిర్ణయం సత్పలితాలు ఇవ్వకుంటే మరో మార్గం ఆలోచిస్తారు. కానీ కేసిఆర్‌ ఎంచుకున్న మార్గం నుంచి పక్కకు జరగలేదు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెగించి కొట్లాడాడు. తెలంగాణ సాధించాడు. నిజానికి కేసిఆర్‌ లేనిదే తెలంగాణ లేదు. ఇది ప్రజలకు బాగా తెలుసు. అంతేకాకుండా తెచ్చిన తెలంగాణ ఎలా అభివృద్ధి చేయాలన్నది కూడా ఒక్క కేసిఆర్‌ కే తెలుసు. అందుకే ఆయన అటు సంక్షేమ, ప్రగతి రంగాలలో ప్రజలకు అద్భుతాలు చూపిస్తున్నాడు. అసలు రైతు బంధు వంటి పథకం అమలు చేయొచ్చని ఎవరైనా ఊహించారా? దేశంలో ఎంతో మంది గొప్ప నాయకులు పాలన సాగించారు. కానీ ఏ ఒక్కరూ కేసిఆర్‌ అమలు చేస్తున్న పథకాలను పరిచయం చేయలేదు. పేదింటి ఆడపిల్ల పెళ్ళి కి సహకరించడమే గొప్ప పథకం. అందులోనూ బాల్య వివాహాలు జరగకుండా కట్టడి చేయడం అనేది గొప్ప ఆలోచన. గతంలో ప్రభుత్వాలు బాల్య వివాహాలను అరికట్టాలని అనేక ప్రయత్నాలు చేశాయి. తెలంగాణ లో కళ్యాణ లక్ష్మీ అమలుతో బాల్య వివాహాలు ఆగిపోయాయి. అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దూరదృష్టిని ఎవరైనా ప్రశంసించాల్సిందే. అంత గొప్ప విజన్‌ వున్న నాయకుడు కేసిఆర్‌ నాయకత్వంలో పని చేస్తే చాలు అని కాంగ్రెస్‌, బిజేపి నాయకులు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!