కమీషన్‌ అంటే ఆ కమీషనరే!?

` ఏ రోజు లెక్క ఆరోజే!!

`ప్రతి రోజూ కిలాసలు నిండాల్సిందే!

`లకారాలు లేనిదే ఇంటికి వెళ్లరంతే? 

`ఉద్యోగులను ఎవరినీ నమ్మడు!

`నలుగురు ప్రైవేటు వ్యక్తులతో వ్యవహారం నడిపిస్తాడు?

`సికింద్రాబాద్‌ లో అవినీతి పరాకాష్ఠకు చేరుకొని తబాదలయ్యాడు!

`ఓ మహిళా ఉద్యోగి పిర్యాధుతో ట్రాన్స్‌ ఫర్‌ తప్పలేదు.

`దీపావళి పండగ సమయంలో ఉద్యోగులకు టార్గెట్‌?

`ఆ టార్గెట్‌ ఫుల్‌ ఫిల్‌ చేయలేమని మహిళా ఉద్యోగి తిరుగుబాటు?

`ఫైళ్లకొచ్చేవి ఇస్తూనే వున్నాం…ఇంకా కావాలంటే ఆస్థులు అమ్ముకోలేం…ఇదీ ఆ మహిళా ఉద్యోగి సమాధానం!

`ఇక్కడ ఉద్యోగులను నమ్ముకోకుండా ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు!

`నగర శివారులో పదిహేనెకరాలు సంపాదించుకున్నాడు?

`నెల నెల కోట్లు కూడబెట్టుకుంటున్నాడు?

`ఎమ్మెల్యే ఎన్ని సార్లు హెచ్చరించినా తీరు మారడం లేదు?

`అడ్డూ, అదుపు లేని సంపాదన ఆపడం లేదు!

` అన్నీ ఆన్‌ లైన్‌ అనుమతులైనా సరే…అడిగినంత ముట్టజెప్పాల్సిందే!

`ఇక బిల్డర్లైతే ఏది కోరితే అది ఇవ్వాల్సిందే?

`ముగ్గు కనిపిస్తే చాలు…సంచులు పంపాల్సిందే?

`మోడల్‌ కారిడార్‌ పనుల్లో ఎంత కమీషనో అని గుసగుసలాడుతున్న ఉద్యోగులు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజలకు మేలు చేయాల్సిన వాళ్లు, ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు, ప్రజల చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల్లో కొంత మంది అవినీతి సంపాదనకు బాగా అలవాటు పడుతున్నారు. గతంలో ఇంత అవినీతి వుండేది కాదు. ఇంత పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునే అవకాశం వుండేది కాదు. ఒక వేళ అవినీతి చేసేందుకు అవకాశం వున్నా, అధికారులు తప్పు చేసేవాళ్లు కాదు. లంచాలు తీసుకునే వాళ్లు కాదు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ అధికారి గురించి విన్నా అవినీతి అన్న పదమే వినిపిస్తోంది. నేను లంచం తీసుకోను అన్న మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. లంచం తీసుకునే అవకాశం లేని చోట ఉద్యోగం కూడా కావాలని కోరుకోవడం లేదు. ఏ కార్యాలయం సంపాదనకు ఆలవాలమో ముందే తెలుసుకుంటున్నారు. అలా తయారైంది వ్యవస్ధ. ఒకప్పుడు ప్రజలే తమ పని సకాలంలో ఇబ్బందులు లేకుండా పూర్తయితే ఎంతో కొంత ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఆ పని చేసి పేడితే నాకేం లాభం…నాకేంత ఇస్తావు? అని నేరుగా ప్రశ్నించే అధికారులే ఎక్కవగా కనిపిస్తున్నారు. అంతే కాదు అడిగినంత ఇస్తే తప్ప పని చేసి పెట్టడం లేదు..కాదు..లేదు అన్న మాట ప్రజల నుంచి వస్తే ఇక అంతే సంగతులు… ఆ ఫైల్‌ ముందుకు వెళ్లేది లేదు. పని జరగడం అంత కన్నా లేదు. అలా తయారైంది వ్యవస్ధ. ముఖ్యంగా రియలెస్టేట్‌ విపరీతంగా పుంజుకోవడం, నగరాలలో జనాభా రోజు రోజుకూ పెరుగుతుండడంతో ప్రజల అవసరాలు ఉద్యోగులక వరాలుగా మారుతున్నాయి. లంచాలకు దారులు పరుస్తున్నాయి. లంచం తీసుకోవడం నేరమని తెలిసినా, తమను ఎవరు ఏం చేయలేరన్న ధైర్యం కూడా ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ అంటే ఉద్యోగుల్లో అంతో ఇంతో భయం వుండేది. ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఆ శాఖ ఏం చేస్తుందో కూడా తెలియకుండాపోతోంది. అటు రాజకీయ నాయకుల ప్రోద్భలం, ప్రజల బలహీనతల కారణంగా కొందరు ఉద్యోగులు ఆడిరది ఆట…పాడిరది పాటగా మారుతోంది. అవినీతి సంపాదనకు ఆలవాలమౌతోంది. ఒక్కసారి ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసే అవకాశం వస్తే చాలు..తర తరాలు కూర్చున్నా తరగతనంత ఆస్ధి సంపాదించుకునే అవకాశం ఎదురౌతోంది. ఇలా సంపాదనా పరులుగా మారిన ఉద్యోగులు ప్రజలకు దూరంగా, నాయకులకు దగ్గర వుంటూ, కోరుకున్న చోట పోస్టింగులు వేయించుకొని మరీ సంపాదనకు ఎగబడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసిలో పనిచేసే ఓ డిప్యూటీ కమీషనర్‌ కూడా వున్నాడు. 

 అది ఒకప్పుడు గ్రామ పంచాయితీ ప్రాంతం. తర్వాత మున్సిపాలిటీ అయ్యింది. కొన్నేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేరింది. ఐటి రంగమంతా ఇప్పుడు అక్కడే కనిపిస్తోంది. ఇంకేముంది ఆ పల్లె కాస్త పట్టణంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఐటికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా కాలుష్య కాసారంగా వుండేది. నగరానికి చాలా దూరం అనిపించేది. కాని ఇప్పుడు నగరంలో భాగమైంది. అసలైన నగరంగా ఆ పల్లే అభివృద్ది చెందింది. దాంతో రియలెస్టేట్‌ రంగం విసృతంగా పెరిగింది. పల్లె కాస్త ఆకాశహ్రమ్యాల నిర్మాణాలతో వెలిగిపోతోంది. అలాంటి సర్కిల్‌లో ఉద్యోగం అంటే మాటలా….మాట మాట్లాడితే చాలు మూట రావాల్సిందే…పెన్ను తీస్తే చాలు నోట్లు కనిపించాల్సిందే…సంతకం పెట్టాలంటే ప్రతి దానికి ఓ రేటు చెప్పాల్సిందే…అలాంటి సీట్లో కూర్చున్న డిప్యూటీ కమీషన్‌ సంపాదన గురించి వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే…అక్కడ పనిచేసే ఉద్యోగులు, పనుల కోసం వచ్చేవారు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే…అంతే….

ఈసారు వారు ఇంతకు ముందు సికింద్రాబాద్‌ సర్కిల్‌లో పనిచేశారు. 

అక్కడ ఆయన కింద వుండే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని కమీషన్ల సంపాదన కోసం వేధించుకుతినేవాడట. ఓ సందర్భంలో దీపావళి పండగకు ఒక్కొ ఉద్యోగి పది లక్షలు ఇవ్వాలని హుకూం జారీ చేశాడట. దాంతో ఓ మహిళా ఉద్యోగి నా వల్ల కాదని, ప్రతి ఫైలుకు అందాల్సినంత అందిస్తూనే వున్నాం…ఇంకా లక్షలు కావాలంటే మా ఇంటిని కుదువ పెట్టి ఇవ్వాల్సిందే…నేను ఇవ్వను…ఏం చేసుకుంటారో చేసుకోండి? అని మొహం మీదే చెప్పిందట. ఈ విషయం ప్రభుత్వ పెద్ద దాకా చేరిందట. దాంతో ఆ డిప్యూటీ కమీషనర్‌ను అక్కడినుంచి నగర శివారు సర్కిల్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే తంతే భూరల బుట్టలో పడ్డట్టు…మంచి ప్రైమ్‌ లోకేటేడ్‌ ఏరియాగా డెవలప్‌ అవుతున్న సర్కిల్‌కు రావడంతో ఆ కమీషనర్‌కు మరింత పంట పండిరది. కమీషన్ల ఆదాయం విపరీతంగా పెరిగింది. రియల్‌ రంగం ఎంత పెరిగిందో అంత సంపాదన మొదలైంది. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టు కట్టుకోవాలన్నా, ఎవరైనా ఐదంతస్తు బిల్డింగ్‌ కట్టుకోవాలంటే కమీషన్‌ ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే..అంతా ఆన్‌లైన్‌ సిస్టమ్‌లోనే ధరఖాస్తులు అని చెబుతున్నప్పటికీ, నిర్మాణంలో లొసుగులు చూపించేసి మొత్తం కూల్చేస్తే తర్వాత ఎందుకు ఇబ్బంది అని ప్రజలు కూడా ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. ఆ అధికారి సంపాదనకు అందరూ సహకరిస్తున్నారు. 

 ఇక వసూళ్ల పర్వంలో ఈ అధికారి కింది స్ధాయి అధికారులను నమ్మరు…సికింద్రాబాద్‌లో ఎదురైన అనుభవంతో ఆయన ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నారు.

 ఓ నలుగురు ప్రైవేటు వ్యక్తులకు ఆయన పనులు అప్పగిస్తారు. వారి పని నిత్యం సర్కిల్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలౌతున్నాయి. ఎక్కడ రిపేర్లు జరుగుతున్నాయి. ఎక్కడ నిర్మాణాలలో ఉల్లంఘనలు జరిగాయి. రోడ్లు ఎవరు ఆక్రమించుకున్నారు. ఎవరు పర్మిషన్ల కన్నా, ఎక్కువ ఫ్లోర్లు వేసుకున్నారు..పెంట్‌ హౌజ్‌లు ఎక్కడున్నాయి. వాటికి పర్మిషన్లు వున్నాయా? లేదా లాంటి వివరాలు సేకరించడం…ఆ డిప్యూటీ కమీషనర్‌కు వివరాలు అందించడం…ఇదీ నిత్యకృత్యం. ఇటు బిల్డింగ్‌ పర్మిషన్ల కోసం వచ్చే సంపాదనతోపాటు, అటు ఉల్లంఘన పేరుతో జరిగిన నిర్మాణాలపై దృష్టితో వచ్చే సంపాదన అంతా ఇంతా కాదు…నెలలో కోట్లు కూడబెడుతున్నాడని సమాచారం…

                        

                                 

                             ఇలాంటి అవినీతి అధికారిని ఎక్కడా చూడలేదు: ప్రజలు..బాధితులు

                               మా వల్ల కాదు…ఆ కమీషనర్‌ ఆగడాలు భరించలేం? అంటూ ప్రజలు , రియలెస్టేట్‌ వ్యాపారులు నేటిధాత్రిని ఆశ్రయించి, తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాము ఎలాంటి తప్పులు చేయకపోయినా, ఉల్లంఘనల పేరుతో వేధింపులకు గురైన వారు కూడా అనేక మంది వున్నారు. ఇక పర్మిషన్ల విషయంలో ఎదురైన సమస్యలు అనేక మంది చెబుతూ, డిప్యూటీ కమీషనర్‌కు అవినీతిపై తమ బాధలు చెప్పుకుంటున్నారు. గతంలో ఎంతో మంది అధికారులను చూశాం కాని…ఇలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అధికారిపై ప్రజలు చెప్పిన వివరాలతో కూడిన సమగ్ర కథనాలు వరుసగా మీ నేటిధాత్రిలో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *