ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం

 

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు కేజీలు తూకం నిర్వహించి తామె వాహనాలలో తమకు కేటాయించిన మిల్లు వద్దకు తీసుకెళితే తీరా అక్కడ మిల్లర్లు నలభై నాలుగు కేజీలు ఉంటేనే దిగుమతి చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు అని ఆరోపించారు ఈ విషయమై స్థానిక రెవెన్యూ ఆఫీసర్లకు చెప్పిన ఫలితం లేకుండా ఉందని ఆరోపించారు మేము మిల్లర్ల తో మాట్లాడదాం చేస్తాం అని చెబుతున్నారే తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ధాన్యం తగుల బెట్టి నిరసన వ్యక్తం చేసిన రైతులు,

స్థానిక ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని అని రైతులు దేవేందర్ రావు సుధాకర్ ధరావత్ బాలు ఆడెపు విజయ్ నరిశెట్టి రాజు భానోత్ ఎరుక చింతకుంట్ల రాజు సుమారు 40 మంది రైతులు వేడుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *