
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి- పూజ్య స్వామి పరమార్థదేవ్ గారి యోగా శిబిరాన్ని విజయవంతం చేయాలని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి నందనం కృపాకర్ పిలుపునిచ్చారు. చందానగర్ పిజెఆర్ స్టేడియంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తారానగర్ విద్యానికేతన్ స్కూల్ లో సోమవారం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు పతంజలి యోగ పీఠ్ ముఖ్య కేంద్రీయ ప్రభారీ డాక్టర్ పూజ స్వామి పరమార్థ దేవ్ జీ నేతృత్వంలో ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగా శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యోగ ప్రేమికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజి శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పతంజలి భారత్ స్వాభిమాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివకుమార్, పతంజలి యోగ సమితి హైదరాబాద్ వెస్ట్ జిల్లా అధ్యక్షులు విఠల్, భారత్ స్వాభీమాన్ ట్రస్ట్ హైదరాబాద్ వెస్ట్ జిల్లా ఉపాధ్యక్షులు నూనె సురేందర్, పతంజలీ యోగ సమితి ప్రతినిధులు ధీరజ్ సింగ్, తరిగొప్పుల స్వేత, కుల్వంత్ సింగ్ రాజ్ పురోహిత్, జ్యోతి, వెంకటాచారి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.