
మద్దతు తెలిపిన సిఐటియు మండల కన్వీనర్ నరేంద్ర
కారేపల్లి నేటి ధాత్రి.
కారేపల్లి మండల కేంద్రంలోని పిహెచ్సి పరిదిలో సమ్మెను ప్రారంభించారు .ఆశాల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసిన పట్టించుకోని కారణంగా ఆశ వర్కర్స్ 25వ తేదీ నుంచి ప్రారంభమైందని సిఐటియు సింగరేణి మండల కన్వీనర్ కే నరేంద్ర పేర్కొన్నారు
కారేపల్లి పీహెచ్సీ పరిధిలోని సమ్మె శిబిరాన్ని కే నరేంద్ర ప్రారంభిస్తూ ప్రసంగించారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని,32 రకాల ఫైళ్లను ప్రభుత్వం ప్రింట్ చేసి ఇవ్వాలని,పని భారం తగ్గించాలని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా పిఆర్సి ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిర్ణయించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో సమ్మె జరుగుతుందని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కే నరేంద్ర డిమాండ్ చేశారు. సమ్మె శిబిరంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల జంగా కళ్యాణి కుమారి సరస్వతి దేవ కరుణ ఈశాల ఈశ్వరి కృష్ణమ్మ దేవి పద్మ అంజమ్మ ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.