అవగాహనతోనే కట్టడి సాధ్యం

వరంగల్,నేటిధాత్రి:అవగాహనతోనే కరోనాను అంతం చేసేందుకు సాధ్యమౌతుందని పరికిపండ్ల అశోక్ అన్నారు.ఆదివారం కరోనా కట్టడికి డాక్టర్ పరికిపండ్ల అశోక్ చేపట్టిన ప్రజా చైతన్య బైక్ యాత్ర 25 వ రోజు, నాల్గవ జిల్లా వరంగల్ అర్బన్ లో భాగంగా వరంగల్ మహానగరం 11 వ డివిజన్ క్రిస్టియన్ కాలని గాంధీ నగర్ లో కరోనా పై అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే ఉచిత హోమియోపతి మందుల పంపిణీ చేశారు. ప్రజలు, పారిశుధ్య కార్మికులు సుమారు 1200 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచు కున్నారు.ఈ సందర్భంగా డా అశోక్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ,మాస్కులు ధరించి ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రపరచి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి,నగర కార్యదర్శి – భశీర్, బుస్సా రవీందర్, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల సాయికుమార్, మెడిది అశోక్,అశోక్,గుండె భద్రి, గన్నపు రమేష్,దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.