అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం (మహబూబాబాద్) నేటిధాత్రి:మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మరియు మున్సిపాలిటీ భవనాన్నిమహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.భవన నిర్మాణం ఎంత ముక్యమో అదే విధంగా ఇన్ఫ్రాస్త్రక్టర్ ,పరిసరాలు, పార్కింగ్,పచ్చదనం లాంటి అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు కొన్ని సూచనలు చేసారు.మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయడమే సీఎం లక్ష్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరిద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, యాళ్ల మురళీధర్ రెడ్డి, గోగుల రాజు, హరిసింగ్, ఎలెందర్ మరియు తదితరులు ఉన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.