అడుగడుగునా ఆశలు నిండి! మరునాటికే ఆశలు ఆవిరి!!

`ఒక అడుగు ముందుకు…

`పది అడుగులు వెనక్కు…

`ఏళ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు.

`బతుకుదెరువు శాపమైన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగులు.

`ఉద్యోగ సంఘాలు ఎంతో కృషి చేశాయి.

`దేవీ ప్రసాద్‌ ఆదిలో ప్రోద్బలం.

`తర్వాత సుబ్బారావు, కారం రవీంద్‌ రెడ్డిల సహాకారం.

`ఇప్పుడు మామిళ్ల రాజేందర్‌ తోడ్పాటు…

`ఒక దశలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాకా సమస్య తీసుకెళ్లారు.

`సకల ఉద్యోగుల సదస్సు తీర్మానాలలో చేర్చారు.

`మంత్రి వర్గం ఉప సంఘంలో చర్చించారు.

`ఖమ్మం లో కూడా మంత్రి కేటిఆర్‌ అక్కడి కలెక్టర్‌ కు ఆదేశాలిచ్చాడు.

`వరంగల్‌ లో మంత్రి కేటిఆర్‌ మాటిచ్చాడు.

`ఎప్పటికప్పుడు కొలువులు వచ్చినట్లే వచ్చి, ఆగిపోతున్నాయి.

`ఎంతో సహకరించారు…ఇంకొంచెం సహకరించండి.

`వారి జీవితాలలో కొత్త సంవత్సరంలోనైనా వెలుగులు నింపండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

2016లో తొలగింపబడిన గృహ నిర్మాణ శాఖ ఒప్పంద ఉద్యోగుల సమస్య ఒక అడుగు ముందుకు…పది అడుగులు వెనక్కు… అన్నట్లు సాగుతోంది. వారిని తొలగించిన నాటి నుంచి పడుతున్న వేధన, ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల పాటు ఆ శాఖలో విధులు నిర్వర్తించారు. ఇక కొలువులకు ఢోకా లేదనుకున్నారు. పర్మనెంట్‌ కాకపోయినా, ఉద్యోగ భద్రత వుంటుందనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ళ పాటు కొలువులు చేశారు. పిడుగులాంటి వార్త వినాల్సివస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల ఇండ్ల నిర్మాణం ప్రకటించింది. కానీ ఆ పనులను గృహ నిర్మాణ శాఖకు అప్పగించలేదు. దాంతో తెలంగాణ లో 1700లకు పైగా వున్న ఒప్పంద ఉద్యోగుల తొలగింపు జరిగింది. 

తెలంగాణ వచ్చాక తమ జీవితాలు మరింత ఆశా జనకంగా వుంటాయనకున్న ఒప్పంద ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

 అయితే ప్రభుత్వం వీరిని తొలగించాలనుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ఇళ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. అందుకే ఆ శాఖ ను ముఖ్యమంత్రి కేసిఆర్‌ తొలగించారు. పైగా జరిగిన అవినీతిపై విచారణకు కూడా ఆదేశించారు. నిజానికి గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతికి ఈ ఒప్పంద ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఆ శాఖలో పనిచేయడం మూలంగా వీళ్లు బలైపోయారు. కొలువులు కోల్పోయారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఈ ఒప్పంద ఉద్యోగులకు అండగా నిలిచారు. వీరిలో ఆత్మస్థైర్యం నింపగలిగారు. తొలుత ఈ ఒప్పంద ఉద్యోగులు అప్పటి టిజివో నాయకుడు దేవీ ప్రసాద్‌ ను కలిశారు. వారి గోడు చెప్పుకున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయించాలని వేడుకున్నారు. దేవీ ప్రసాద్‌ కూడా వీరికి పూర్తి స్థాయిలో సహకరించారు. 

ఈ ఒప్పంద ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ వద్దకు కూడా దేవీ ప్రసాద్‌ తీసుకెళ్లారు.

 ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ బాధితులకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అప్పాయింట్‌ మెంట్‌ కూడా ఖరారయ్యే సమయానికి పాలేరు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. కొంత కాలం వీరి పని వాయిదా పడిరది. అయినా వాళ్లు తమ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. దేవీ ప్రసాద్‌ ఆ సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడకు వీళ్లు వెళ్లడం జరిగింది.

అదే సమయంలో ఖమ్మం వచ్చిన మంత్రి కేటిఆర్‌ దృష్టికి ఈ ఉద్యోగుల సమస్యను దేవీ ప్రసాద్‌ తీసుకెళ్లారు.

 అప్పటికప్పుడు కేటిఆర్‌ కూడా అక్కడే వున్న కలెక్టర్‌ కు వీళ్ల సమస్య పరిష్కరించాలని సూచించారు. కాకపోతే ఎన్నికల షెడ్యూల్‌ అయిపోయిన తర్వాత చూద్దామని కలెక్టర్‌ చెప్పడం జరిగింది. ఇక తమ సమస్యలు తీరినట్లే అనుకున్నారు. అప్పటి టిఎన్జీవో జనరల్‌ సెక్రెటరీ కారెం రవీదందర్‌ రెడ్డి, ఉద్యోగ జేఏసి నాయకుడు సుబ్బారావు వీరికి దారి చూపుతూ వస్తున్నారు. 

ఒక సమయంలో తెలంగాణ సకల ఉద్యోగుల సదస్సు ఎల్బీనగర్‌ లో జరిగింది.

 ఆ వేధికగా వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలను చర్చించడం జరిగింది. వారి సమస్యలు తీర్చాలని ఆ సభ 18 తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో 5 వ అంశంగా సుబ్బారావు ఒప్పంద గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల సమస్యను కూడా చేర్చారు. సుబ్బారావు చేసిన ఈ పని వల్ల అన్ని శాఖల ఉద్యోగులతో పాటు వీరికి కూడా ప్రాధాన్యత దక్కింది. ఇలా ఉద్యోగ సంఘాల నేతృత్వంలో జరిగిన సదస్సు తీర్మానాలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు దేవీ ప్రసాద్‌ అందజేయడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఓ సభా సంఘాన్ని ప్రకటించారు. ఆ కమిటీ కూడా వీళ్ల సమస్యను కూలంకషంగా చర్చించింది. చాలా శాఖల సమస్యలు తీరాయి. కానీ ఈ ఉద్యీగుల సమస్య మాత్రం తీరలేదు. 

ఇంతలో హైదరాబాదు, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.

 దేవీ ప్రసాద్‌ కు సిఎం కేసిఆర్‌ టికెట్‌ ఇచ్చారు. దాంతో ఈ ఉద్యోగుల పని మళ్ళీ పెండిరగ్‌లో పడిరది. అయితే ఆ ఎన్నికలలో దేవీ ప్రసాద్‌ గెలిస్తే ఈ ఒప్పంద ఉద్యోగుల జీవితాలు మారిపోయేవేమో! ఆ ఎన్నికలలో దేవీ ప్రసాద్‌ ఓడిపోవడం, కొంత కాలం ఆయన కూడా కొన్ని వ్యాపకాలు తగ్గించుకున్నారు. పైగా అలాంటి సమయంలో దేవీ ప్రసాద్‌ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని ఉద్యోగులు కొంత కాలం ఆయనను కలవలేదు.దేవీ ప్రసాద్‌ కు బివరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి రావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఈ ఉద్యోగులు వెళ్లారు. పనిలో పనిగా వారి విషయం కూడా దేవీ ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకుడు కారెం రవీందర్‌ రెడ్డితో టచ్‌ లో వుంటూ వస్తున్నారు. అటు సుబ్బారావు, ఇటు రవీందర్‌ రెడ్డి ఇద్దరూ చేయాల్సిన ప్రయత్నం చేస్తూ వచ్చారు.

ఎలాగైనా వీళ్ల సమస్యను ఓ దారిలో పెట్టాలన్న ఆలోచనతో సుబ్బారావు, రవీందర్‌ రెడ్డి లు అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్దకు తీసుకెళ్లారు. 

ఆయన తొలుత జరగదని చెప్పినా సుబ్బారావు, రవీందర్‌ రెడ్డి ల ఒత్తిడి మేరకు ప్రయత్నిస్తానని చెప్పారు. అదే సమయంలో అప్పటి కలెక్టర్‌ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా చేయలేనని ఆ కలెక్టర్‌ చెప్పడం జరిగింది. కానీ అప్పటి వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ మాత్రం తమ శాఖలో ఉద్యోగుల కొరత వుందని, వీళ్లను తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆ వార్త విన్నాక ఈ ఒప్పంద ఉద్యోగుల ఆనందాలకు అవదులు లేకుండా పోయాయి. త్వరలో కొలువులలో చేరుతామని అనుకున్నారు. 

అదేంటో గాని ఆ కమీషనర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం కూడా చేయించాడు. 

ఇంతలో మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఇలా వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో రెండు సార్లు 51 మంది ఉద్యోగులకు కొలువులు ఇవ్వడం జరిగుతుందని తీర్మానాలు చేయడం జరిగింది. కానీ కొలువులు రాలేదు. ఒకసారి కమీషనర్‌ ట్రాన్స్‌ఫర్‌ తో ఆగిపోయింది. మరోసారి అప్పటి మేయర్‌ వల్ల ఆగిపోయింది. 

ఏళ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు.

 బతుకుదెరువు శాపమైన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగులు. కొంతకాలం దేవీ ప్రసాద్‌, సుబ్బారావు, రవీందర్‌ రెడ్డి లు ఎంత సహకరించారో ఇప్పుడు మామిళ్ల రాజేందర్‌ తోడ్పాటు కూడా వుంది. 

వరంగల్‌ లో మంత్రి కేటిఆర్‌ మాటిచ్చాడు.ఎప్పటికప్పుడు కొలువులు వచ్చినట్లే వచ్చి, ఆగిపోతున్నాయి.ఎంతో సహకరించారు…ఇంకొంచెం సహకరించండి. వారి జీవితాలలో కొత్త సంవత్సరంలోనైనా వెలుగులు నింపండి. నిజంగా ఇలాంటి ఇబ్బందులు ఏ ఉద్యోగులకు రావొద్దు. అందరూ సహకరించినా ఎందుకు వీళ్ల కొలువులు ముందట పడడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *