అంతా అతనే చేశాడు!?

` సూత్రదారి, పాత్రదారి అతనే?
` స్టాంపుల అమ్మకంలో లూటీ…ఛలాన్ల మాయాలో బురిడీ?
` మాకు దిక్కేదంటున్న భాధితులు
` నకిలీ ఛలాన్ల పేరుతో వెండర్లకు టోకరా?
` తప్పు మాదంటేనే లైసెన్సుల పునరుద్దరణ
` ఏం జరిగినా మాదే బాధ్యత?
` అర్ధరాత్రి దాకా బాధితులకు బార్లో బుజ్జగింపులు?
` తప్పించుకున్నా అర్ధరాత్రి వెంబడిరతలు?
` రాత్రి ఒంటిగంటకు బలవంతగా సంతకాలు?
` అదే రాత్రి షాపు తెరిచి సంతకాలతో పాటు,స్టాంపులు?
` ఒకరి సంతకాలను చూపి ఇతరులపై ఒత్తిడి?
` ఓ జిల్లాకు చెందిన కీలక తెరాస నేత బాధితులకు బెదిరింపులు
` ఆ నేతకు, ఈ కేసుకు సంబంధం ఏంటి?
` ప్రైవేటు వ్యక్తులకు నియమించుకొని ఏమిటీ అక్రమ దందాలు
` దోచుకోవడానికి దొడ్డి దారులు?
` నొక్కేసిన బిల్లులు చెల్లింపుల్లో…అతని తిప్పలు?
` కాలం ఎదురు తిరగడంతో ఇప్పుడు అవస్థలు

హైదరాబాద్‌ , నేటిధాత్రి :
కాలం కలిసొస్తే చాలు కొంత కాలం తిరుగుండదు. కావాల్సిన కుర్చీ దొరికితే చాలు సంపాదనకు అడ్డూ అదుపు వుండదు. కొన్నిశాఖల్లో ఇది పరిపాటి. రిజిస్ట్రేషన్‌ శాఖలో నిత్య కృత్యమిది. అన్న ఆరోపణలు వినిపిస్తున్నవి. ఎవరో చూస్తారన్న భయం వుండదు? పై కుర్చీలను చల్ల బరిస్తే చాలు…ఇంకేముంది? నాకేమౌతుందిలే…నన్వెరు పట్టుకుంటారు లే….లెక్కలు…బొక్కలు ఎవరు చూస్తారు లే…పట్టుకున్నప్పుడు చూద్దాంలే…ఎంక్వౌరీ దాకా వస్తే అప్పుడాలిచిద్దాం లే…అవసరమైతే స్టాంపు వెండర్లు, ప్రాంకింగ్‌ వెండర్లను ఇరికించొచ్చు లే…ఎట్లైనా మనం తప్పించుకోవచ్చులే…పెద్ద తలకాయలన్నీ మనకు అనుకూలమే లే…సమయమొస్తే కాపాడుతారు లే…వాళ్లది వాళ్లకు ముట్టజెప్పినంక ఏం చేస్తారులే…అంతా గప్‌ చుప్‌…ఎక్కడి వాళ్లు అక్కడే….!? ఏం జరిగిందో బైట ప్రపంచానికి తెలియదొద్దు…ఎవరూ బైటకు చెప్పొద్దు…లేకుంటే బెదిరింపులు…కాని కాలం కాటేసే సమయం వస్తే అంతా బైట పడుతుంది. బాగోతం అంతా బజారుకెక్కుతుంది….ఇదే ఇక్కడ జరిగింది….
ఏళ్లు గడుస్తున్నా…చేసిన తప్పులకు శిక్షలేవు. సస్పెన్సుకు గురౌతారు..మూడు నాలుగు నెలలు సెలవులు తీసుకున్నంత సంబరంగా కాలం గడుపుతారు..మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఈ మాత్రం దానికి ఇబ్బంది ఎందుకు? టెన్షన్‌ ఎందుకు? ఎంచక్కా ఎదురుచూస్తూ వుంటే చాలు…ఉద్యోగం అదే నడుకుంటూ వస్తుంది. కుర్చీలో కూర్చోమంటుంది. ఉద్యోగం చేసినంత కాలం సంపాదించుకోమని చెబుతుంది? ఇదే ఉద్యోగులు నమ్ముకుంటున్నది. ఇలా అయితే అవినీతి జరిగిందని తెలిసినా పట్టుకోవడాలు ఎందుకు? విచారణలు ఎందుకు? ఎవరైతే విచారణ చెస్తారో…మళ్లీ వాళ్లే తప్పులేదని రిపోర్టులివ్వడం ఎందుకు? పై అధికారి, విచారణ చేసేది ఒక్కరే అయినప్పుడు ఈ హడావుడి ఎందుకు? వారిని కుర్చీల్లోనుంచి పంపడం ఎందుకు? మళ్లీ పిలిచి మరీ కుర్చీలు వేయడం ఎందుకు? ఇది వ్యవస్ధ లోపమా? వ్యక్తులుగా సమాజంలో జనం లోపమా? ప్రభుత్వాల నిర్లక్ష్యమా???
ఎనమిదేళ్ల క్రితం జరిగిన కథకు ముగింపు లేదు. కథ కంచికి చేరింది లేదు. కాని బాధితులే ఏడుస్తున్నారు. కడుపు నిండా తింటున్నది లేదు. కంటినిండా నిద్ర పోతున్నదిలేదు. ఊరొదిలి వెళ్తున్నది లేదు. పండగలు, పబ్బాలు లేవు. అవినీతి ముద్రవేసి సమాజంలో దోషులుగా అమాయకులను చూపించి, చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు వాళ్లు తలెత్తుకోలేక, తమది తప్పేం లేదని ఎంత చెప్పినా వినేవారు లేక గొడగొడ ఏడుస్తున్నారు. మీది తప్పేం లేదన్న ఒక్క మాట చాలంటున్నారు బాధితులు..అంతకు మించి ఏమీ వద్దంటున్నారు. . సమాజంలో ఇలాంటి పరిస్ధితి ఎవరికీ రావొద్దంటున్నారు.
కరీంనగర్‌ జిల్లా రిజిస్రార్‌ కార్యాలయంలో సురేష్‌ అనే ఉద్యోగి చేసిన ఘన కార్యం మూలంగా ఎనమిది మంది నిత్య నరకం అనుభిస్తున్నారు. ఎప్పటిలాగే నలుగురు స్టాంపు వెండర్లు, నలుగురు ప్రాంక్లింగ్‌ వెండర్లు బిల్లులు చెల్లిస్తూ స్టాంపులు తీసుకుంటుండేవారు. కాని తీసుకున్న సొమ్ములు సురేష్‌ ప్రభుత్వ ఖజానలో జమ చేసేవారు. తన సొంత జేబులు నింపుకుంటుండేవారు. మూడేళ్ల కోసారి ఓ ముచ్చట అన్నట్లు ఆ శాఖలో అప్పుడప్పుడు తనికీలు జరుగుతుంటాయి. ఖజానకు కన్నం పడిరదన్న సంగతి తేలిపోయింది. సురేష్‌ను సస్పెండ్‌ చేశారు. జైలుకు పంపించారు. అదేంటో గాని ఇంత చేసినా ట్రిబ్యునల్‌ ఉద్యోగం చేసుకోవచ్చన్నది. కాకపోతే అంతా రికవరీ చేయించాలన్నది. మరి ఇప్పుడెలా…తన ఉద్యోగానికి భరోసా…ఖజానకు నొక్కేసినవి భర్తీ అన్నది తక్షణ కర్తవ్యం. దాంతో ఎవరినైతే దోషులంటూ సురేష్‌ ముద్ర వేశాడో…వారినే భ్రతిమిలాడితే చాలు. పనైపోతుంది. తన తప్పేం లేదని తేలిపోతుంది. అందుకు ఏం చేయాలి. తన అధికారాన్ని ఉపయోగించాలి. దాంతో సురేష్‌ నయానా, భయానా కూడా బెదించడం జరిగింది. భుజ్జగింపుల పర్వంలో ప్రాంక్లిన్‌ వెండర్‌ను సురేష్‌ బారుకు తీసుకెళ్లారు. గంటలు గంటలు బ్రతిమిలాడాడు. అసలు విషయం ఏమిటంటే తప్పు మాది…సురేష్‌ది ఎలాంటి తప్పులేదు…ఇది చెప్పాల్సింది.లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వాల్సింది… అంటే…తప్పుచేసిన సురేష్‌ తప్పించుకోవడానికి ఆ తప్పు ఏ తప్పు చేయని వెండర్లు నెత్తి మీద వేసుకోవాలి. అయితే చెల్లింపులు మాత్రం సురేషే చేసుకుంటాడు. కాని ఒక్కసారి సంతకం పెట్టి తప్పు మాదే…అంటే ఇక వెండర్లు దోషులమని ఒప్పుకున్నట్లే…దాంతో ఆ వెండర్‌ ససేమిరా? అన్నాడు. ఏ బార్‌లో భుజ్జగిస్తున్నారో అక్కడినుంచి సురేష్‌కు చెప్పకుండా తన ఇంటికి వెళ్లిపోయాడు. అయినా సురేష్‌ ఊరుకోలేదు. వెంబడిరచాడు. అర్ధరాత్రి ఆ వెండర్‌ ఇంటికి వెళ్లాడు. నయానో..భయానో సంతకం చేయించాడు….? ఆ వెండర్‌ను దోషిని చేసే ఆధారం సంపాదించాడు.


ఈ కాగితం చూపించి సురేష్‌ మరో ప్రాంక్లిన్‌ వెండర్‌ను కూడా కాగితం మీద సంతకం చేయమన్నాడు. కాని అతను ఎంత భ్రతిమిలాడినా ససేమిరా? అన్నాడు. సంతకం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను? అంటూ భరోసా ఇవ్వడమే కాదు, జిల్లా రిజిస్ట్రార్‌ కూడా మద్దతిస్తాడు? అని సురేష్‌ చెప్పాడు. దాంతో సదరు వ్యక్తి రిజిస్ట్రార్‌ దగ్గరకు వెళ్లడంతో సంతకం చేయాలా? వద్దా? అన్నది నీ ఇష్టం…దాని విషయంలో నేనేం చెప్పాలి? అన్నాడు. ఇదంతా ఏదో లేనిపోని వ్యవహారంలా వుందన్న సంగతి గమనించి ఆ వెండర్‌ నాటి జిల్లా ఎస్పీకి పిర్యాధు చేశాడు. జరిగిందంతా పూస గుచ్చినట్లు వివరించాడు. ఇది తెలిసిన జిల్లా రిజిస్ట్రార్‌ వెంటనే సురేష్‌తోపాటు, ఇతర ఎనమిది మంది వెండర్లు కూడా దోషులే అన్నట్లు పిర్యాధు చేశాడు.
ఇప్పుడు ఆలోచించండి….బాధితులు తప్పు మాదే అన్నట్లు సంతకం పెడితే జిల్లా రిజిస్ట్రార్‌ ఎలాంటి పిర్యాధు చేసేవారు కాదు. కాని ఓ ప్రాంక్లిన్‌ వెండర్‌ ససేమిరా అనడంతో అందర్నీ దోషులుగా ముద్రవేసే పన్నాగం పన్నారు. ఇదిలా వుంటే సురేష్‌ ఓ ముగ్గురు చేత సంతకాలు చేయించడమే కాకుండా, సదరు వెండర్లనుంచి తీసుకున్న సొమ్మును కొంత ఖజానలో జమ చేశారు. అయితే అసలు ట్విస్టు ఇక్కడే వుంది. వెండర్లు నకిలీ ఛలాన్లు తెచ్చారనే దోషులను చేశారు. ఒక వేళ అదే నిజమైతే తర్వాత తెల్లించాల్సివస్తే అదే వెండర్లు చెల్లించాలి. కాని బాధితులు చెల్లించలేదు. అసలు సూత్రదారి, పాత్రదారి సురేష్‌ ప్రత్యేకంగా నియమించుకున్న ఓ ప్రైవేటు ఉద్యోగి పేరు మీద ఛలాన్లు తీసి బిల్లులు చెల్లించారని బాధితులు వెల్లడిరచారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పేరు మీద ఎలా బిల్లులు చెల్లిస్తారు? ఒక తప్పు, పదేపదే తప్పులను చేయిస్తుంది. కాని పెద్దల ఆశీస్సులు కూడా పుష్కలంగా వుండడంతో ఖజానకు సొమ్మువచ్చిందా? లేదా? అన్నది చూసుకుంటే చాలన్నంత దోరణిలో సురేష్‌ను ఉన్నతాధికారుల కాపాడారు….మళ్లీ, మళ్లీ…మరింత…మరింత దోచుకోవడానికి మార్గం చూపించారు…..మరి బాధితులకు న్యాయం ఎవరు చేస్తారు? ఇంత గోల్‌ మాల్‌ గోవిందం ఏళ్ల తరబడి జరుగుతున్నా పట్టించుకుంటారు? బాధితుల గోడు ఎవరు తీర్చుతారు? వారికి న్యాయం ఎవరు చేస్తారు?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *