ఐఎంఎల్ డిపో హమాలి ఉద్యమ కమిటీ నాయకులు….
కొల్చారం( మెదక్ ) నేటి ధాత్రి:
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గన్ పూర్ లో ఉన్న ఐఎంఎల్ డిపో లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐ ఎం ఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులకు ఐఎంఎల్ డిపో లో పని కల్పించాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ కు వినతి పత్రం సమర్పించామని ఐఎంఎల్ డిపో ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రమేష్ సానుకూలంగా స్పందించారు. ఐ ఎం ఎల్ డిపో సమస్య నా దృష్టికి వచ్చిందని మేనేజర్ తో మాట్లాడి నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తానని అడిషనల్ కలెక్టర్ రమేష్ హామీ ఇచ్చారని ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఐఎంఎల్ డిపో ముందు శాంతియుతంగా ఐఎంఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు ధర్నా చేశారు. దీనికి స్పందించిన డిపో మేనేజర్ మాట్లాడుతూ సామరస్యంగా పోరాటం చేయండి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఐఎంఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో. అధ్యక్షులు పులే బోయిన మల్లేశం, ఉపాధ్యక్షులు సోమ నర్సింలు , నేత దాసు, కోశాధికారి లక్ష్మీనారాయణ, కార్యదర్శి కమ్మరి మల్లేశం, ఆర్గనైజర్ కార్యదర్శులు, కుంటి ముత్తయ్య, నర్సింలు , మోతిలాల్, కార్యవర్గ సభ్యులు టి నర్సింలు, బైకరి శ్రీకాంత్, కట్ట నారాయణ, ఇమ్రాన్ బాబా, నాగం శీను, చాకలి మల్లేశం , సందీప్ గౌడ్, ఐఎంఎల్ డిపో ఉద్యమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.