కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ తో కలెక్టర్ ఆదేశాలు జారీ.!
50 సంవత్సరాలుగా ఆస్తులు ఉన్న రైతులకు ఊరట.
అమాయకుల పొట్ట కొట్టి 100 ఎకరాలు దోచుకుందాం అనుకున్నారు, ఆవిరి అయిన ఆశలు.!
మహాదేవపూర్- నేటి ధాత్రి:
ఉమ్మడి మండలంలోని పలిమెల మండలంలో సిమెంట్ ధర్మాకారానికి సుమారు 100కు పై ఎకరాల భూములను అప్పగిచి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రైతులకు అన్యాయం జరుగుతుందని అనేక సంవత్సరాలుగా కాస్తులో ఉన్న రైతులకు కు పట్టాలు లేకపోవడం తో,పట్టాదారు పేర్లు ఉండడం పెద్ద మొత్తంలో రుసుమును ఆశించిన పట్టాదారులు సిమెంట్ కర్మాగారానికి అప్పగించడం పై జిల్లా కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు మంత్రులకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనికి సంబంధించి స్పందించిన జిల్లా కలెక్టర్ భూముల రిజిస్ట్రేషన్ పై తక్షణమే విచారణ జరిపించాలని పలివెల తహసిల్దార్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రైతుల భూములు సిమెంట్ కర్మాగారానికి రిజిస్ట్రేషన్ పై విచారణకు ఆదేశం అనేక సంవత్సరాలుగా ఇనాం లేదా అనువంశికం ద్వారా గత 50 సంవత్సరాల క్రితం దొరల వద్ద ఎట్టి చాకరి చేసిన సంపాదించుకున్న భూములు నేటికీ ఆయా కుటుంబాలు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి భూములకు దుష్టశక్తులు ఆన్లైన్, పహాని, ధరణిలో పేర్లు ఉండడంతో ఏకంగా సిమెంట్ ధర్మాదారానికి భూములు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ పై విచారణకు ఆదేశాలకు సంబంధించి వివరణ నేటి ధాత్రి వివరణకు ప్రయత్నించగా పలివెల తహసిల్దార్ అందుబాటులోకి రాలేదు.