సింగరేణిలొ గైర్హాజరవుతున్న ఉద్యోగులకు కౌన్సెలింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

 

కొత్తగూడెం జిఎం ఎం. షాలెం రాజు ఆదేశానుసారం 2023 సంవత్సరంలో 01.01.2023 (జనవరి) నుండి 31.07.2023 (జూలై) వరకు 50 మస్టర్ కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులకు తేదీ: 28.08.2023 (సోమవారం) న ఆర్.సి.ఓ.ఏ క్లబ్ నందు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. గైర్హాజరైన ఉద్యోగులలో దాదాపుగా 40 మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ మొదటిగా ఈ కౌన్సిలింగ్ లో హాజరైన వారి గత సంవత్సరములలో చేసిన హాజరులను మరియు నాగాలకు సంబంధించిన విషయాలను గూర్చి సంబంధిత మైన్స్/ డిపార్ట్మెంట్స్ యొక్క సంక్షేమ అధికారిని అడిగి తెలుసుకున్నారు. మరియు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితి బాగోలేని వారికోసం పర్సనల్ డిపార్ట్మెంట్ ఏజిఎం (పర్సనల్) పి.సామ్యూల్ సుధాకర్ కి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారి యొక్క పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది.

తర్వాత జిఎం. మాట్లాడుతూ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ సహకారంతో కారుణ్య ఉద్యోగాలు పొందిన కార్మికుల యొక్క వారసులు అట్టి ఉద్యోగాలు చేయక, సంవత్సరమునకు కనీసం వంద మాస్టర్లు కూడా హాజరు కావడంలేదని తద్వారా మన కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి రవాణా విషయాలలో సంపూర్ణం చేయుటలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నదని ఉన్న ఉద్యోగులకే పని భారం పడుతున్నదని తెలియజేయడం జరిగినది మరియు వారిని ఉద్యోగాలకు హాజరు కావాలని తెలియజేస్తూ మన సింగరేణి సంస్థ లో ఇంటర్నల్ ఉద్యోగాలకు ఎటువంటి కేటగిరి తో సంబంధం లేకుండా విద్యార్హతను పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని దానిని ఉపయోగించుకొని ఎంతోమంది ఉన్నత పదవులలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే మన సంస్థలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తూ ఇంటర్నల్ గా పదవన్నతలు పొందుతూ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న/దిగిపోయిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు విధులకు హాజరవుతూ మీకు, మీ కుటుంబాలకు మరియు సంస్థకు ఉపయోగపడేలా ఉండాలని తెలియజేయడం జరిగింది. గైర్హాజరవుతున్న ఉద్యోగులకు మరి యొక్క అవకాశం కల్పిస్తున్నామని వారు తప్పక రాబోవు మూడు నెలలలో ప్రతి నెలకు కనీసం 26 మస్టర్లు చేయాలని ఆదేశించారు. రాబోవు మూడు నెలలు వారిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేశారు లేనిపక్షంలో వారికి యాజమాన్యం తీసుకొని చర్యలకు వారే బాధ్యులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు తో పాటు ఎస్ఓటు జిఎం జివి కోటిరెడ్డి, ఏజిఎం (పర్సనల్) పి సామ్యూల్ సుధాకర్, పీవీకే.5 ఇంక్లైన్ ఏజెంట్ బి.రవీందర్, మెడికల్ ఆఫీసర్ జత్ రామ్, పర్సనల్ మేనేజర్ డి.కిరణ్ బాబు, సీనియర్ పిఓలు ఎం.శ్రావణ్ కుమార్, అజయ్ కుమార్ మరియు టీబీజీకేఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ , ఏ.ఐ.టి.యు.సి కత్తెర రాములు, ఐ.ఎన్.టి.యు.సి కే.ఆల్బర్ట్, సిఐటియు విజయగిరి శ్రీనివాస్, హెచ్.ఎం.ఎస్ వై.ఆంజనేయులు, బి.ఎం.ఎస్. ఎం.రవికుమార్, మరియు కొత్తగూడెం ఏరియాలో గైర్హాజరైన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి కోఆర్డినేటర్ సిహెచ్ సాగర్ ఇతర ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *