ప్రారంభానికి ముస్తాబైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ నూతన భవన సముదాయపు భవనం … జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా
అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళు జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్ డిస్ర్టిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్)
సిద్ధం అయినట్లు చెప్పారు. ఈ భవనాన్ని 12వ తేదీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు.
*26 ఎకరాల్లో ఐడిఓసి*
నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 26 ఎకరాల కె.ఎస్.ఎం స్థలంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం 56.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఐడీవోసి లొనే
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించినట్లు చెప్పారు.
*సకల హంగులు..*
IDOC లో 56 శాఖలకు గదులను నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల కోసం మూడు చాంబర్లను, విజిటర్స్ వెయింటింగ్ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్ మీటింగ్ హాల్‌ను నిర్మించారని చెప్పారు. కలెక్టర్, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలనా అధికారి చాంబర్లను కేస్ట్ సీలింగ్ (సెంట్రల్ ఏసీ) చేశారు. సమీకృత సమావేశ మందిరాన్ని సైతం సెంట్రల్ ఏసీగా మార్చారు. జీ+2 పద్ధతిన నిర్మించిన కలెక్టరేట్లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్ పై భాగంలోకి చేరుకునేందుకు రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణామైన ఐ.డి.ఓ.సి భవనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుందని చెప్పారు.
ఈ మేరకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లును పర్యవేక్షించారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు అన్ని శాఖల జిల్లా అధికారులు కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఐడీవోసికి హెలికాప్టర్ లో వస్తారని, పోలీసుల గౌరవ వందనం, ఐడీవోసి శిలా ఫలకం అవిష్కరణ, కలెక్టర్ ఛాంబర్ పరిశీలన తదుపరి జిల్లా అధికారులతో సమీక్ష, తదుపరి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.