శంకరయ్య…’మనీ’కింకరుడయ్యా!? శంకరయ్య ఒత్తిళ్లు..! టిపిఎస్‌ లకు తిట్లు?

 

`ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

`పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు.

`లంచాలు తింటున్నారని శాపనార్థాలు?

` క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…

`జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో చుక్కలు చూస్తున్న ఉద్యోగులు.

`సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

` శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు?

` అధికారులను రాచి రంపానపెడుతున్నాడు?

`మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు?

`జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు?

`ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

`జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు?

`ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు?

ఉద్యోగం వచ్చేదాకా జీవితం… సమాజం…జనం…సేవ… ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేస్తారు. కొంత మంది అదే జీవితాంతం అనుసరిస్తారు. కొందరు అవన్నీ మర్చిపోతారు…సంపాదనకు ఎగబడతారు. ఉద్యోగం చేస్తూ ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ, పనులు చేయడానికి నా కేంటి? అనడం మొదలు పెడతారు…మొహమాటం లేకుండా ఎంతిస్తావ్‌ అని బేరం పెడుతుంటారు…ఇటీవల కాలంలో ఆ బేరం కూడా మారిపోయింది. ఇంతిస్తే గాని పని కాదని చెప్పేస్తున్నారు…పని కావాల్సిన ప్రజలు అంతివ్వలేను మహా ప్రభో అని బ్రతిమిలాడుకుండున్నారు. అయినా కొందరు అధికారులు కనికరం అన్నది వారి దరిదాపుల్లో లేనట్లు, వారి డిక్షనరీ లో లేనట్లు, నా మాటే శాసనమన్నట్లు వసూలు చేస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు…కోట్లు కూడబెట్డుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య ఒకరు? అని జనం చెప్పుకుంటున్న మాట…ఉద్యోగుల ఆవేదన. 

ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

 జోనల్‌ కమీషనర్‌ పెట్టే టార్గెట్ల మూలంగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు టార్గెట్లు పెడుతూ, జనాన్ని ఇబ్బందులు పెట్టినట్లే ఉద్యోగులను కూడా జోనల్‌ కమీషనర్‌ రోజుకింత వారానికింత అని ఆర్డర్‌ వేస్తాడు. దాంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగ సిబ్బంది యాతన అంతా ఇంతా కాదు…జోనల్‌ కమీషనర్‌ మాట కాదనలేక, ఎదురు చెప్పలేక, మా వల్ల కాదనలేక, ఉద్యోగం చేయడం తప్పని సరై వారు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలతో పంచాయతీ పెట్టుకునేది అధికారులు, తిట్లు తినేది అధికారులు. పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు. 

తాజాగా శేరి లింగంపల్లిలో నిర్మాణంలో వున్న ఓ బిల్డింగ్‌ కూల్చివేసేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వచ్చారు.  

దాంతో స్థానిక ప్రజలు, ఆ నిర్మాణానికి చెందిన వ్యక్తులు టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని తిట్టిన తిట్టు తిట్డకుండా తిట్టారు. ఇప్పటికే ఇవ్వాల్సిన లంచాలు ఇచ్చాము…ఇంకా ఎన్ని సార్లు లంచాలు లంచాలివ్వాలని దూషించారు. శాపనార్థాలు పెట్టారు. నిజానికి ఆ బిల్డింగ్‌ నిర్మాణం అక్రమమే అయితే నిర్మాణం మొదలైనప్పుడే అధికారులు అడ్డుకోవాలి. నిర్మాణానికి అవసరమైన హద్దులు ఇవ్వాలి. అంతే కాని నిర్మాణానికి ముందు అన్ని రకాల అనుమతులు ఇచ్చి, తీసుకోవాల్సినంత తీసుకొని, మరింత లాగేందు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదు. కానీ ఇలా సగం నిర్మాణం జరిగిన తర్వాత అడ్డుకుంటేనే అధికారులు అడిగినంత ముట్డజెబుతారు. ఇదీ జిహెచ్‌ఎంసి అధికారులు అనుసరించే విధానం. అలాగే శేరిలింగంపల్లిలోనూ జరుగుతోంది. గతంలో ఇక్కడ అలాంటి వాతావరణం లేదని ప్రజలు, అధికారులు కూడా అంటున్నారు. జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వచ్చిన తర్వాతే ఇలాంటి పనులెక్కువయ్యాయని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది చుక్కలు చూస్తున్నారు. 

సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

 గతంలో ఇదే శంకరయ్య సికింద్రాబాద్‌ జోనల్‌ కమీషనర్‌ గా పనిచేసిన సమయంలో అక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దీపావళి పండగ సందర్భంగా తలా ఓ పది లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారట…అధికారులు తమ వల్ల కాదని తెలిసినా, ఆయనకు ఎదురు చెప్పలేక తలాడిరచారట…కానీ ఓ మహిళా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఎదురుతిరిగిందట…ఏకంగా మంత్రి కేటిఆర్‌ దృష్టికి ఈ సమస్య వెల్లేలా చేసిందట. దాంతో శంకరయ్య తిక్క కుదిరిందనే అందరూ అనుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తప్పించి, శేరి లింగంపల్లి జోన్‌ కు మార్చడంతో ఇక శంకరయ్య అవినీతికి పుల్‌ స్టాప్‌ పడుతుందనుకున్నారట…అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏరికోరి శంకరయ్య కు శేరి లింగంపల్లి లో పోస్టింగ్‌ వేయించారట…శంకరయ్య తీరు ఏ మాత్రం మారలేదు. నిజానికి సికింద్రాబాద్‌ లో ఆమ్థానీ తక్కువ. ఇక్కడ నగరం విస్తరిస్తున్నందున రోజువారీ సంపాదన శంకరయ్య కు పెరిగిందనేది అధికారులు చెప్పుకునే మాట. 

శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు? 

అధికారులను రాచి రంపానపెడుతున్నాడు? అనేది ఇక్కడ ప్రధాన వాదన. మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు? ఇక ఇదిలా వుంటే జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు? ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

 జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు? ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు? జనం చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!