వివిధపార్టీల నుండి 65 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

మండలం ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో

ఖానాపూర్ నేటిధాత్రి

నర్సంపేట నియోజకవర్గం సీఎం కెసిఆర్ సారధ్యంలోని బిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 75 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వృద్ధ నాయకులు ఏపాటి అభివృద్ధి చేశారో జనాలను స్పష్టం చేయాలన్నారు.ఇన్నిసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు ప్రజల రవాణా దూరాన్ని తగ్గించడం కోసం ఖానాపురం మండలం నుండి పక్క మండలానికి కలిపే రోడ్డు నిర్మాణం చేయలేని నాయకుల పనిని నేను ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను మున్నేరువాగు పై 40 కోట్ల రూపాయల వ్యయంతో చెన్నారావుపేట, తిమ్మరాయి పహాడ్ రెండు బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.వడగండ్ల వానతో ఖానాపురం మండల రైతులు పూర్తిగా నష్టపోయారని పార్టీ మండల నాయకత్వం నా దృష్టికి తేవడంతో వేకువజామునే పరిశీలించి, అధికారులను అప్రమత్తం చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలబడి 6 కోట్ల 44 లక్షల రూపాయల పరిహారం ఈ నెల 25 తారీఖు నుండి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.నర్సంపేట నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఎలాంటి తారతమ్యం లేకుండా అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు.ఖానాపురం మండల ప్రజలు చైతన్యవంతులని నా కంటే ముందు,నేను వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మీరే వేదికగా అందరికి తెలియపర్చాలని నూతనంగా పార్టీలో చేరిన వారిని కోరారు.నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై, జరగాల్సిన పనులపై కనీసం ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రతిపక్ష నాయకుడే లేడని హెద్దేవచేశారు.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవని, ఓన్లీ సీఎం కేసీఆర్ పక్షమే సాగుతుందని అన్నారు.నేడు నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున చేరికలు రివాజుగా మారాయని అన్నారు.5 పర్యాయాలు పరిపాలించిన నాయకులు 60 ఏండ్లు ఎనక్కి తీసుకెళ్లితే మీ ఆశీర్వాదంతో గెలిచిన నేను సీఎం కేసీఆర్ అందించిన సహకారంతో నర్సంపేట నియోజకవర్గంను ఎడ్యుకేషన్ హబ్,హెల్త్ హబ్,ఇరిగేషన్ హబ్ మొత్తానికి “అభివృద్ధి నర్సంపేట” గా చేసానని తెలిపారు.నేడు ఎంపీపీ ప్రకాష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీలో చేరిన వారి పేర్లు కొట్టే వెంకట రత్నం, రాజబోయిన ఫున్నెష్, మర్రి సురేష్,చిన్నపెళ్లి పోశాలు,తిక్క కమల్ హాసన్, బద్దెపూరి కుమారస్వామి, మాసారపు శ్రీనివాస్, జన్ను సాగర్, మైనార్టీ నాయకులు షేక్ రఫిక్ పాషా, షేక్ మున్నీర్ పాషా, మహ్మద్ రహమత్ పాషా, షేక్ కలిల్ పాషా, కాసోజు రామాచారి, రాళ్లబండి ప్రసాద్, తౌడోజు ఉపేంద్రా చారి, పర్వతపు నారాయణ, కోయగురి కుమారస్వామి, కందిగొండ శ్రీను, శ్యామంతుల రవి, కోడూరి సాంబరాజు, రాంబాబు, పోలోజు బ్రహ్మం, మర్రి శ్రీను, మహిళలు మొత్తం 65 కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ,ఎంపిటిసి మర్రి కవిత, ఉపసర్పంచ్ మేడిద కుమార్, సొసైటీ డైరెక్టర్ నీలం సాంబయ్య, సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు బొప్పిడి పూర్ణచందర్రావు, నాయకులు రెడ్డి నాగార్జున రెడ్డి, వల్లపు శ్రీనివాస్, బోడ పూలు నాయక్, కొలిశెట్టి పూర్ణచందర్రావు, గంగాపురం రాజు, గంగాపురం రమేష్ మైనార్టీ నాయకులు ఎండి హాజహార్, గులాం మహమ్మద్, నజీర్, తోటకూరి రాజు,ఓర్సు రవి,మర్రి రామస్వామి, జన్ను సురేష్, చిన్నపెళ్లి వెంకటేశ్వర్లు, చిన్నపెళ్లి సుధాకర్, పీసరి వెంకన్న, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *