➡️మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో గోడువెల్లబోసుకున్న దళిత రైతు నర్సయ్య
➡️కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు పెట్టుబడికి డోకా లేకుండే
➡️చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య ఆవేదన
చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండలానికి ఓ శుభకార్యానికి వెళ్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు *బోయినపల్లి వినోద్ కుమార్* గంగాధర మండల సమీపంలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర తన వాహనాన్ని నిలుపగా మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య మాజీ ఎంపీ *బోయినపల్లి వినోద్ కుమార్* ని చూసి వాహనం దగ్గరకు వచ్చి తన వ్యవసాయ పొలం చూడండి సారూ…నా పరిస్థితి ఇలా ఉందని మొరపెట్టుకున్నారు.
దళిత రైతు నర్సయ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఏమైంది నర్సయ్య వ్యవసాయం ఎలా నడుస్తోంది అని రైతు నర్సయ్యను మాజీ ఎంపీ వినోద్ కుమార్ అడగగా
సారూ వడ్ల పైసలతో పొలం దున్నిన, విత్తనాలు తెచ్చి నారుపోసిన….
కానీ వరినాటుకు వచ్చింది నాటు వేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు నారు ముదురుతోంది…
రైతుబంధు పైసలు వస్తాయని ఆశకొద్ది చూస్తున్న…రెండు దినాలకోసారి బ్యాంకు కు వెళ్లి ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసి వస్తున్న….ఇంకా రైతుబంధు పైసలు పడకపోవడంతో నాటు వేసేందుకు వెనుకడుగు వేస్తున్న సారూ..
కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు రెండు పంటలకు పెట్టుబడి కోసం పైసలకు డోకా లేకుండె…నాటు వేసే సమయానికి రైతుబంధు పైసలు పడేటియి.
గీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా బ్రతుకులు ఆగం అయ్యే పరిస్థితి వచ్చింది.
మాజీ ఎంపీ వెంట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పీఏసీఎస్ చైర్మన్ రాజనర్సింహ రావు, నాయకుల సంపత్ ఉన్నారు