రైతు రాజ్య నిర్మాణమే బిఆర్‌ఎస్‌ నినాదం

` రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్‌ విధానం.

` రైతు ప్రగతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం.

`రైతు రాజు కావడమే బిఆర్‌ఎస్‌ సంకేతం.

` రైతు కోసమే బిఆర్‌ఎస్‌… రైతు నాయకుడే కేసిఆర్‌.

`దేశమంతా సస్యశ్యామలం కావాలి.

` రైతు ఇంట సుఖ శాంతులు నిండాలి.

`సముద్రం పాలౌతున్న నీరు పొలాలకు మళ్లించాలి.

`దేశమంతా బంగారు పంటలు పండాలి.

`ఆహార భద్రతకు లోటు లేకుండా సుభిక్షం కావాలి.

`ఆకలి రాజ్యం తీరాలి.

`ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి.

`దేశమంతా రైతుకు ఉచిత విద్యుత్‌ అందాలి.

` రైతు బంధు దేశమంతా అమలు కావాలి. 

`జై కిసాన్‌ అనే నినాదం దేశమంతా వినిపించాలి.

` కేసిఆర్‌ నాయకత్వానికి జేజేలు పలకాలి.

`ప్రధానిగా కేసిఆర్‌ డిల్లీ పీఠం మీద కూర్చోవాలి.

`బిఆర్‌ఎస్‌ దేశంలోనే సంచలన రాజకీయ శక్తిగా వెలుగొందాలి.

`దేశమే గులాబీ మయమై గుభాలించాలి.

`బిజేపిని ఎదుర్కోవడంలో బిఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తి అని నిరూపింపబడాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 దేశ రాజకీయాలలో నవ శకం చిగురించబోతోంది. ఈ విషయం నేటిధాత్రి ఎప్పటినుంచో చెబుతూనే వస్తోంది. బిఆర్‌ఎస్‌ రూపంలో దేశ రాజకీయాలను సమూలంగా మార్చబోతోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించబోతోంది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో సరికొత్త వేధిక ఆవిష్కరింబడిరది. కొత్త తరం రాజకీయాలకు పురుడుపోయనుంది. సంపన్న వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న కుహనా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పనుంది. పేదల కేంద్రంగా, రైతుకు భరోసానిచ్చే బిఆర్‌ఎస్‌ పాలన రాబోతోంది. దేశాన్ని ఆలోచింపజేయనుంది. యువతను కదిలించబోతోంది. నమ్మి బిజేపిని గెలిపిస్తే పేదల జీవితాలను ఆగమ్యగోచరం చేయడాన్ని ప్రశ్నించనుంది. దేశ ప్రజలు ఆలోచించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేయబోతోంది. 

ప్రపంచంలోని అన్ని దేశాలలో రైతు నిశ్చింతగా బతుకుతున్నాడు.

 చింత లేకుండా కాలం వెల్లదీస్తున్నాడు. ఆయా దేశాలకు అన్నం పెడుతున్నాడు. గౌరవంగా బతుకుతున్నాడు. ప్రభుత్వాలనుంచి సబ్సిడీలు అందుకుంటున్నాడు. కొత్త కొత్త యంత్రపరికరాలతో నూతన సాగు విధానాలు అవలంబిస్తున్నాడు. సాగు దిగుబడిలో విప్లవాలు సృష్టిస్తున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధరతో రాజులాగా బతుకుతున్నాడు. మరి మన దేశంలో రైతు చింత చెందుతున్నాడు. సాగు చేయాలంటే కలత చెందుతున్నాడు. సాగు వదిలేయలేక కుమిలిపోతున్నాడు. ప్రకృతి వ్యవసాయంతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్యుగా బతుకుతున్నాడు. మన రైతు జీవితం మారాలి. రైతు ముఖంలో సంతోషం వెల్లివిరియాలి. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం. రైతు రాజ్య నిర్మాణమే బిఆర్‌ఎస్‌ నినాదం.

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు దు:ఖించిన రాజ్యం ముందటపడదని అంటారు.

 అందుకే రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్‌ విధానంగా ఎంచుకున్నారు. స్వతాహగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ది రైతు కుటుంబం. రైతు పడే వేదన, అనుభవించే ఆవేదన ఆయన తెలుసు. దేశం సుభిక్షంగా వుండాలంటే రైతు సంతోషంగా వుండాలి. కోట్లు సంపాదించిన వాళ్కైనా ఆహారమే తినాలి. అది రైతే పండిరచాలి. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టినా, సాగు పరిశ్రమ కూడా అంతే విధంగా ఎదగాలి. ఏదైనా పరిశ్రమ నుంచి ఒక వస్తువు తయారై బయటకు వస్తే లాభపడేది కొందరే…కానీ రైతు ఒక గింజ పండిస్తే దాని ద్వారా లబ్ధి పొందేవాళ్లు ఎంతో మంది. ఈ విషయం పాలకులు గుర్తించకపోవడం వల్లనే నేడు రైతు డొక్క ఎండకపోతోంది. ఒక్క తెలంగాణలోనే రైతు సంతోషంగా వున్నాడు. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయి. నేడు రైతును రాజును చేస్తున్నాయి. ఒకప్పుడు పాతిక ఎకరాలున్న రైతు కూడా బికారే…ఇప్పుడు ఐదెకరాల భూమి వుంటే కరోడ్‌ పతే. అందుకే తెలంగాణ రైతు సంక్షేమం దేశంలోని ప్రతి రైతు అందుకోవాలి. 

జై కిసాన్‌ అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. 

కానీ నిజంగా దేశంలోని రైతు గర్వంగా బతుకుతున్నాడా! సంతోషంగా వున్నాడా? లేడు. అందుకే రైతు ప్రగతే బిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఎంచుకొని ముందడుగు వేస్తోంది. దేశంలో ఇప్పటికీ 65 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సుమారు తొంభై శాతం ప్రజలు సాగు మీద బతికేవారు. సాగు స్థిరీకరణ పడిపోతోంది. రైతు బలవంతంగా ఇతర మార్గాలు ఎంచుకొని కూలీ జీవితాలు గడపుతున్నాడు. అందుకే మళ్ళీ సాగువైపు రైతు అడుగులు పడాలి. రైతు స్వతంత్ర జీవనం సాగించాలి. అది ఒక్క కేసిఆర్‌ ద్వారానే సాధ్యమౌతుంది. రైతుకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఎవరికీ లేదు. బిజేపి పార్టీకి అసలే లేదనేదే బిఆర్‌ఎస్‌ ప్రధాన ఆరోపణ. అందుకే రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. రైతు శ్రేయస్సే దేశ సౌభాగ్యం అనే నినాదం కేసిఆర్‌ ఎత్తుకున్నారు. రైతు కన్నీరు తుడిచేందుకు బయలు దేరుతున్నాడు. రైతు రాజు కావడమే బిఆర్‌ఎస్‌ సంకేతం అని కేసిఆర్‌ ప్రకటించాడు. 

రైతు కోసమే బిఆర్‌ఎస్‌…

 రైతు నాయకుడే కేసిఆర్‌. దేశమంతా సస్యశ్యామలం కావాలి.రైతు ఇంట సుఖ శాంతులు నిండాలి. సముద్రం పాలౌతున్న నీరు పొలాలకు మళ్లించాలి. దేశమంతా బంగారు పంటలు పండాలి. ఆహార భద్రతకు లోటు లేకుండా సుభిక్షం కావాలి. ఆకలి రాజ్యం తీరాలి.ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. దేశమంతా రైతుకు ఉచిత విద్యుత్‌ అందాలి. రైతు బంధు దేశమంతా అమలు కావాలి. జై కిసాన్‌ అనే నినాదం దేశమంతా వినిపించాలి. కేసిఆర్‌ నాయకత్వానికి జేజేలు పలకాలి. ప్రధానిగా కేసిఆర్‌ డిల్లీ పీఠం మీద కూర్చోవాలి.

 రాజకీయాలలో కొత్త పార్టీలు రావడం సహజం.

 టిఆర్‌ఎస్‌ ను బిఆర్‌ఎస్‌ గా మార్చడంతో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ గా పేరు మార్పుతో జాతీయ పార్టీ అవుతుందా? అని కొందరు పెదవి విరుస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసినప్పుడు సరిగ్గా ఇలాంటి మాటలే వినిపించాయి. అదో ఉప ప్రాంతీయ పార్టీ అన్నారు. ప్రాంతీయ పార్టీ హోదా కూడా కష్టమే అన్నారు. ఏమైంది అన్న వారి నోళ్లు మూతబడ్డాయి. పుబ్బలో పుట్టి మగలో మాయమయ్యేదన్నారు. ఆ టిఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణ సాధించింది. అలాగే బిఆర్‌ఎస్‌ కూడా. ఒక నాడు ఎలాంటి మాటలు వినిపించాయో అవే మాటలు ఇప్పుడూ వినిపిస్తున్నా, వాటికి, నేటికీ చాలా తేడా వుంది. అప్పుడు కేసిఆర్‌ ఒక్కరే…ఇప్పుడు ఆ ఒక్క కేసిఆరే…కాలం మారింది. ఇప్పుడు కేసిఆర్‌ దేశంలోనే బలమైన నాయకుడు. సంక్షేమ పాలన అందిస్తున్న పాలకుడు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు. అందుకే రానున్న రోజులు బిఆర్‌ఎస్‌ వే కానున్నాయి. బిఆర్‌ఎస్‌ దేశంలోనే సంచలన రాజకీయ శక్తిగా వెలుగొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

దేశమే గులాబీ మయమై గుభాలించాలి.

 దేశ రాజకీయాలలో సమూలమైన మార్పులు రావాలంటే బిఆర్‌ఎస్‌ కావాలి. పేదల రాజ్యం రావాలి అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు బిఆర్‌ఎస్‌ కు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలు కూడా చూస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుని లాంటి నాయకుడు కేసిఆర్‌. ఆయన పట్టుపట్టారంటే ఎలా వుంటుందో దేశానికి కూడా తెలుసు. తెలంగాణ ఎలా సాధించాడో అందరం చూశాం. తాజాగా బిఆర్‌ఎస్‌ ఆవిర్భవ ప్రకటన సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కేసిఆర్‌ మా నాయకుడు అని ప్రకటించాడు. ఆయన నాయకత్వం మాకు కావాలన్నాడు. రైతు కష్టం తీరాలంటే కేసిఆర్‌ దేశ నాయకుడు కావాలన్నారు. ఈ ఒక్క మాట చాలు. దేశం కేసిఆర్‌ వైపు చూస్తోందని చెప్పడానికి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బిజేపిని ఎదుర్కొనే నాయకుడు దేశానికి అవసరం. ఆ పార్టీని ఎదుర్కొని నిలబడే ధైర్యం వున్న నాయకుడు కూడా కావాలి. ఆ రెండు లక్షణాలు పుష్కలంగా వున్న నాయకుడు కేసిఆర్‌. అందుకే దేశమంతా కేసిఆర్‌ వైపు చూస్తోంది. బిజేపిని ఎదుర్కోవడంలో బిఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తి అని నిరూపింపబడాలని జనం కోరుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!