నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామ శివారులో గల శివాని పబ్లిక్ స్కూల్ (గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్) విద్యార్దులు
రాష్ట్ర స్థాయి డ్రాప్ రోబాల్ పోటీల్లో గెలుపొందారు.ఈ సందర్బంగా గెలుపొందిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.అనంతరం
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రోబాల్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈ నెల 9 న హైదరాబాద్ లోని తుర్కయంజల్ లో జరిగిన 2వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ డ్రాప్ రోబాల్ పోటీల్లో వరంగల్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాటశాల విద్యార్థులు జట్టును తృతీయ బహుమతి గెలుపొందడంలో ముఖ్య పాత్ర పోచించినట్లు పేర్కొన్నారు.అందులో భాగమైన శివాని పబ్లిక్ స్కూల్ (గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్) విద్యార్ధులు ట్రిపుల్స్ విభాగంలో లావుడ్య అర్జున్, మాలోత్ దినేష్,కొందం లోకేష్, సూపర్ విభాగంలో సీతా శ్రీరాం, దుడ్డె వర్షిత్,దుడ్డె వరున్,భూక్య లోకేష్, దేవుళ్లపల్లి వరున్, వాoకుడోత్ చిట్టిప్రసాద్, చిరుతము ఆదిత్య,వేల్పుల వెస్లీ లను జట్టును గెలిపించారని పేర్కొన్నారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు డా,కంభంపాటి ప్రతాప్,శ్రీరామ్ కిరణ్, బాలాజీ సాయివిశ్వనాత్, గంధము స్వాతి దేవేందర్, రామకృష్ణ, రాహుల్,ప్రిన్సిపాల్ మొలుగూరి సురేందర్ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కోచ్ యాట రవికుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు పుల్లూరి సుమన్, అక్కెల్లి రాజు , ఉపాధ్యాయ బృందం విద్యార్దులు పాల్గొన్నారు.