ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా ప్రసిద్ధి గాంచి దేశ నలుమూలల నుండి లక్షలాది ప్రజలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని కోరిన కోర్కెలు తీర్చమని వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకొంటూ ఉంటారు. అలాంటి మహత్తర జాతరకు శాశ్వత డోనర్ గా ఉంటూ ఎన లేని సేవలు చేసిన గాయత్రి గ్రానైట్ సంస్థ అధినేత వద్దిరాజు రవిచంద్ర కి ఈ అవకాశం దక్కటం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు