`మిషన్ భగీరథే ప్రజల జీవన ఆయుఃప్రమాణం పెంచుతోంది.
`కట్టాతో మునుగోడులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
`మిషన్ భగీరథ దాహార్తినే కాదు జీవితాలను కాపాడుతోంది.
`మునుగోడులో మంచినీరే సంజీవని.
`ఆ నీళ్ల కోసమే ప్రజలు దశాబ్దాలు కొట్లాడిరది.
`కనికరం లేని కాంగ్రెస్ నేతల శాపమే ఫ్లోరోసిస్ రక్కసి.
`ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది తనువుచాలిస్తున్నా కాంగ్రెస్ నాయకులకు జాలి కలగలేదు.
`ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న కోమటి రెడ్డి సోదరులకు చిత్తశుద్ధి లేదు.
`మునుగోడు మీద రాజగోపాల్ రెడ్డి కి ఎలాంటి ప్రేమ లేదు.
`వెంకట రెడ్డి మంత్రిగా వున్ననాడు మునుగోడుకు మంచినీళ్లు తేలేదు.
`కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు 8 వేల కోట్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి చూశారు.
`పులిచింతల ప్రాజెక్టు లాభాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు.
`1972లోనే పివి. నరసింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు నిధులు కేటాయించారు.
`ఆ విషయం కూడా కోమటి రెడ్డి సోదరులకు తెలియదు.
`నల్గొండ మాదే, బ్రాండ్ మేమే అని చెప్పుకుంటే సరిపోతుందా?
`తెలంగాణ వచ్చిన తర్వాతే మునుగోడు దాహార్తి తీరింది.
`ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందుతోంది.
`ఫ్లోరైడ్ బాధితుల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి.
`ఫ్లోరైడ్ ను మునుగోడు నుంచి తరిమిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కింది.
`మునుగోడులో గెలిచేది కారే…`ప్రజలంతా టిఆర్ఎస్ వెంటే…
`జనం నమ్మకమంతా కేసిఆర్ నాయకత్వం మీదే…
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాకపోతే మునుగోడు లాంటి ప్రాంతాలుఎలా వుండేవో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. గత పాలకుల పాపానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఎంతో మంది అభాగ్యుగులు, ఫ్లోరైడ్ పీడితుల జీవితాలను చూస్తుంటే కళ్లలోనీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అసలు వాళ్లు కొన్ని దాశాబ్దాల కాలంగా పసి తనం నుంచి వయసు మళ్లే దాకా ఎలా బతికి బట్టకట్టారో అన్నది వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎలా జీవించారో , ఎలా జీవితాలను నెట్టుకొచ్చారన్నది చూస్తుంటే గుండె చెరువౌతుంది. తినే తిండిలో ఫ్లోరైడే…తాగే నీటిలో ఫ్లోరైడే…శరీరమంతా ఫ్లోరైడ్నిండి, ఎండిన కర్రల్లా ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో! అనుకుంటూ క్షణ క్షణం బతకడం అంటే ఎంత నరకమో!! వినడానికే గుండె ధైర్యం చాలడం లేదు. అలాంటి మునుగోడు వాసుల గోడు వింటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్ పుణ్యమా అని మిషన్ భగీరథ ద్వారా అందుతున్న మంచినీళ్లు వారి జీవితాలకు అమృతంలా మారి, ఆయు ప్రమాణాలు పెంచాయో వారి మాటల్లో వింటుంటే ఆనందమేస్తుంది. మిషన్ భగీరధ నీళ్లు వారి జీవిత కాలాన్ని పెంచాయని చెబుతుంటే అంతకన్నా సంబురం మరొకటి వుంటుందా? అని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డితో మునుగోడు నుంచి నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు…. మునుగోడులో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రజల మనోగతాన్ని వివరించారు.
ఆ విషయాలు ఆయన మాటల్లోనే… ప్రచారం కోసం మర్రిగూడ ప్రాంతంలో ప్రజలు చూసినప్పుడు గత పాలకులు చేసినపాపం ఏమిటో? వారికి వత్తాసు పలికిన నాయకులు, కనీసం తమ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు ఇవ్వమని అడగలేని దద్దమ్మలాంటి నాయకులు ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. సిగ్గూ శరం విడిచి, మానాభిమానుల వదిలేసి, ఇంకా ప్రజలకు తామే దిక్కని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చేదాకా అక్కడి ప్రజలను పాలించిన నాయకులు ఎంత దుర్మార్గులో ప్రజలకు తెలుసు. అందుకే ఆ పార్టీల నాయకులంటే ప్రజలు అసహ్యించుంకుటున్నారు. అంతే కాదు బిజేపిపార్టీకి చెందిన నాయకులు సిగ్గు లేకుండా తాము ఫ్లోరైడ్ సమస్య తీర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఓవైపు బాధితుడైన స్వామి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు,మంత్రి కేటిఆర్ తమకు ఎలాంటి సాయం చేశారన్నది చెబుతున్నాడు. తెలంగాణరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ తమ మునుగోడుకు ఏం చేశారన్నది చెబుతున్నాడు. ప్లోరైడ్‌ను ఎలా పారద్రోలాడో స్వామి చెబుతున్నాడు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు మిషన్ భగీరధ ద్వారా ఎలా వస్తున్నాయో చెబుతున్నాడు. వాటిని చూసుకుంటూ, స్వామి లాంటి వారు చెప్పే మాటలు వింటూ కూడా ఇంకా బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఫ్లోరైడ్ బాధితుడైన స్వామికి సైతం కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇవ్వలేదు. అతని వృత్తి చేసుకునేందుకు అవసరమైన చేయూతనివ్వలేదు. ఫ్లోరైడ్సమస్య మునుగోడులో తీర్చలేదు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు గోడును ఏనాడో తీర్చారు. స్వామి లాంటి వారికి డబుల్ బెడ్ రూం ఇచ్చారు. ఆయన కాళ్ల మీద ఆయన నిలబడేందుకు అవసరమైన సెలూన్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందించారు. దివ్యాంగుల పెన్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఇదీ మునుగోడు ప్రాంత ఫ్లోడైడ్ బాధితులైన దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత. నిస్సహాయులైన ఫ్లోరైడ్ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అన్నది ఫ్లోరైడ్ ఉద్యమంలో భాగస్వామైన స్వామి చెబుతున్నారు. ఇవి కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని బిజేపి, కాంగ్రెస్ పార్టీలకు రుచించడం లేదు. అసలు ఈ ప్రాంతంలో రాజకీయం చేయడానికి కూడా ఆ రెండు పార్టీలకు ఎలాంటి అర్హత లేదు. ఓటు అడిగే నైతిక హక్కు వారికి అసలే లేదు. ఏ ఒక్కనాడు ఫ్లోరైడ్ భాధితుల గోడు వినుకుండా దశాబ్ధాల పాటు మునుగోడులో రాజకీయం చేసినందుకు వాళ్లు సిగ్గుపడాలి. ఇప్పుడు మునుగోడు ప్రగతిని చూసి తల దించుకోవాలి.నిన్నటి తరం మునుగోడు బాధలుపట్టని పాలకుల నిర్ధయకు బలై, ఎంతనరకం అనుభవించారో కదిలిస్తే ఒక్కొ ఇంటిలో ఒక్కొ ధీనగాధ వినిపిస్తోంది.
కళ్ల ముందే ఫ్లోరైడ్ శరీరంలో నిండిపోయి, తనువు చాలిస్తున్నవారిని చూస్తూ తమ జీవితానికి కూడా రోజులు లెక్కబెట్టుకున్న వారు, ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల ఫ్లోరైడ్ మహామ్మారి నుంచి తప్పించుకొని బతికి బట్టకట్టామని చెబుతున్నారు. కేసిఆర్ లాంటి పాలకులు వుంటే ప్రజలు ఏ సమస్య రాదని చెబుతున్నారు. అప్పటి రోజులకు ఇప్పటి రోజులు పూర్తి భిన్నం. ఉద్యమ నాయకుడైన కేసిఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రమంతా తిరిగారు. అందులో భాగంగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. పరిస్దితి తెలుసుకున్నారు. ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశారు. అప్పటిపాలకులతో కొట్లాడాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ పాలకులకు కనికరం లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు నాలుక లేకపోయింది. ఆ నాలుకలో నరం చచ్చుబడిపోయింది. కనీసం ఉద్యమ నాయకుడు కేసిఆర్‌తో కలిసి గళమెత్తే ధైర్యంలేకపోయింది. వారికి పదవులు కావాలి. కాంట్రాక్టులు కావాలి. ప్రజల గోడు విన్నది లేదు. మునుగోడు బాధ పట్టించుకున్నది లేదు. ఫ్లోరైడ్ మూలంగా ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నా, ఉమ్మడి పాలకులతో కొట్లాడాలన్న సోయి రాలేదు. ఉద్యమ కాలంలో మునుగోడు బాధలు చూసిన కేసిఆర్ తెలంగాణ రాగానే మిషన్ భగీరధ ఫలితాలు ముందు మునుగోడుకే అందించాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. కొన్ని విషయాలు వింటుంటే వారి జీవితానుభవాలు పగవారికి కూడా రాకూడదని అనిపిస్తుంది.
ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు కూడా ముందుకు వచ్చేవారు కాదని తెలిసి ఆశ్చర్యపోయాను. మునుగోడులోని మర్రిగూడ మండలంలో పనిచేయాలంటే ఉద్యోగులు మరింత భయపడేవారట. వాళ్లు ఇక్కడి మంచినీళ్లు తాగలేక దాహం తీర్చుకునేందుకు యూరిన్‌ను పట్టుకొని, వడబోసి తాగేవారని తెలిసింది. అంత దుర్మార్గమైన పరిస్ధితులను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారన్నది విని మనసు చలించిపోయింది. ఇలాంటి పరిస్ధితులు అనుభవించిన వారు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరధ కార్యాక్రమం ఎందుకు ఎంచుకున్నారో అర్ధమౌతుంది. అలాంటి పరిస్ధితులు భవిష్యత్తులో ఏ ప్రాంతానికి రాకూడదన్న బృహత్ సంకల్పంతోనే మిషన్ భగీరధ పథకం తీసుకొచ్చారని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా అర్ధం కావాలి. మిషన్ భగీరధ ఎంత విజయవంతమైన సంక్షేమ పథకమో అప్పుడర్ధమౌతుంది. మాట్లాడేవారు చాలా మాట్లాడతారు. ఒక్కసారి మునుగోడు ప్రజలు బాధలు చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మంచినీళ్ల విలువ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తెలియకున్నా, మునుగోడులో మంచినీళ్లే అమృతంతో సమానం. జీవితాలను నిలబెడుతోంది. అర్ధాంతర ఆయువులను అడ్డుకుంటోంది. గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తుంది. భవిష్యత్తును అందమైన లోకం చేస్తుంది. మునుగోడు ప్రజల జీవితాలను ఆనందమయం చేసింది నీళ్లే…ఆ నీళ్ల కోసమే దశాబ్దాలు వాళ్లు పోరాడిరది. మాకు ఏమీ ఇవ్వకున్నా ఫరావాలేదు. మంచినీళ్లివ్వండి మహాప్రభో అని డిల్లీదాకా వెళ్లే, ఉత్తచేతులు చూపించారు. మళ్లీ ఊసెత్తలేదు. నీళ్లకోసం నిధులు విడుదల చేస్తామని చెప్పి మాట మార్చారు. మర్చిపోయారు. ప్రజలు జీవితాలను ఆగం చేశరు. తెలంగాణ వస్తే గాని మునుగోడు లాంటి ప్రాంతాల బాధ తీరదని చెప్పారు. తెలంగాణ తెచ్చాక మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, తినే తిండిలో, తాగే నీళ్లలో ఫ్లోరైడ్లేకుండా చేశారు…ఫ్లోరైడ్ ను పెంచి పోషించిన పాపాత్ములకు రాజకీయాల్లో స్ధానం లేకుండా చేశారు…అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌నే కొలుస్తున్నారు. టిఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారు.