ముత్తారం :- నేటి ధాత్రి
మచ్చుపేట గ్రామంలో రెండో రోజు క్యాంపు జరుగుతున్న సందర్భంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాజమౌళి క్యాంపును సందర్శించి గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి తో కలిసి గ్రామంలో పర్యటించారు హౌస్ టు హౌస్ తిరుగుతూ నాళాలు డ్రైనేజ్ వాటర్ పరిసరాల పరిశుభ్రత నీటి నిల్వలు దానిలో పెరుగుతున్న లార్వా వాటి గురించి అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేసుకోవద్దని నీటిలో దోమలు గుడ్లు పెడతాయని దీని ద్వారా వందల లార్వాలు తయారై దోమలుగా అభివృద్ధి చెంది కుట్టడం ద్వారా మలేరియా డెంగ్యూ అనేది వ్యాదులు వస్తాయని కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారంలో రెండు రోజులు అనగా ప్రతి మంగళ మరియు శుక్రవారాలు డ్రై & ఫ్రైడే లు పాటించాలని దీని ద్వారా దోమలు అభివృద్ధి చెందకుండా ఉంటాయని ఇంటి చుట్టూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు స్ప్రే మరియు గ్రామంలో నాళాలు నీటి నిల్వలు డ్రైనేజీల దగ్గర అబెట్ స్ప్రే చేయించడం జరిగిందని తెలిపారు 45 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మలేరియా అధికారి ఉమామహేశ్వరరావు ఏఎన్ఎం శోభారాణి ఎం ఎల్ హెచ్ పి దీప్తి ఆశా వర్కర్లు లత కల్పన రజిత శశి కల ఉన్నారు