
చిట్యాల, నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ మండల సమైక్య భవనానికి మరమ్మత్తుల కోసం ఎమ్మెల్యే 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిసింది, సోమవారం సాయంత్రం ఎం ఎస్ పాలక వర్గం మరియు ఐకెపి సిబ్బంది కలిసి జడ్పీటీసీ గొర్రె సాగర్ ఆధ్వర్యంలో శాసన సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి గారిని క్యాంపు కార్యాలయం భూపాల్ పల్లి నందు మార్యాదపూర్వకంగా కలిసి శిధిలావస్థలో ఉన్న ఎం ఎస్ కార్యాలయం మరమత్తుల కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానికి స్పందించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వెంటనే వారి నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు ఇస్తూ జడ్పీటీసీ గారిని తక్షణమే పనులు చేయించాల్సిందిగా సూచించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మరియు జడ్పీటీసీ కి శ్రీ మహాలక్ష్మి మండల సమాఖ్య పాలకవర్గం మరియు ఐకెపి సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు, ఎమ్మెల్యేను కలిసిన వారిలో మండల సమైక్య అధ్యక్షురాలు కొక్కుల ఉమా, కోశాధికారి నవత, ఏపీఎం మంజుల, సీసీలు రమణాదేవి లలిత, పద్మావతి, సాంబశివుడు ఉన్నారు.