బివిఎస్. రమేష్ బాబు మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్ గారు ఏలూరు జిల్లా కోటపాడు గ్రామము నందు తెరాస, టీబీజీకేఎస్.సీనియర్ నాయకులు బి.వి.ఎస్ రమేష్ బాబు. మాతృ మూర్తి పార్తివదేహానికి కి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతపాన్ని తెలియచేసారు. వారికీ 4 గురు సంతానము. బి వి ఎస్ రమేష్ బాబు వారి తల్లి మంచి వైద్యం అందే విధంగా చివరి వరకు దగ్గర ఉండి తమ సహాయ సహకారాలు అందించిన ఎండీ.రజాక్ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్, వైద్యసిబ్బంది, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేసారు.తదనంతరం సత్తుపల్లి లో కాలంచేసిన గోపాలకృష్ణ సీనియర్ ఆపరేటర్ కుటుంబాన్ని కలసి వారికీ మనోదయర్యన్ని ఇవ్వాలని భగవంతుడుని కోరుకుంటూ వారి చిత్రపటానికి నివాళులు అర్ఫించారు.ఈ కార్యక్రమం లో జె ఎస్ ఆర్ మూర్తి, చెన్నకేశవరావు, గణపనేని శ్రీనివాసరావు,ఉపేంద్రచారి, నాగబాబు,గౌస్,ఎండీ యూసుఫ్, క్రాంతి, మురళి, రమేష్ నాయక్, అఫ్రోజ్, నజీర్, వెంకటేశ్వర్లు, అంబ్రూస్,పీటీవీ సత్యనారాయణ,చంద్రశేఖర్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు,బన్ను, కవిరాజ్ తదితర సహ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!