బిఆర్‌ఎస్‌ ఒక చారిత్రక అవసరం: మంత్రి హరీష్‌ రావు.

`బిజేపి అసమర్థ విధానాలపై దేశమంతా రాజకీయ పార్టీల తిరుగుబావుటా

`బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.

`ఖమ్మం సభతోనే బిఆర్‌ఎస్‌ సక్సెస్‌.

`టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, బిఆర్‌ఎస్‌ తొలి సభ నా పర్యవేక్షణలో జరగడం అదృష్టం.

`నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు రావుతో హరీష్‌ రావు. 

`ఒకే వేధిక మీద ఐదారు జాతీయ పార్టీలు. ముఖ్యమంత్రులు.

`ఇటీవల కాలంలో అరుదైన ఘట్టం.

`కేసిఆర్‌ నాయకత్వంతోనే ఇదంతా సాధ్యం.

`బిజేపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ విఫలం.

` బిజేపి అరాచక పాలనపై దేశమంతా వ్యతిరేకత.

`బిజేపి చెప్పిందొకటి చేస్తున్నదొకటి

`వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారు.

`రైతును గోస పెడుతున్నారు. 

`ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం.

`బిజేపి పాలనలో సామాన్యుడు నలిగిపోతున్నాడు

`ఎనమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అధ్భుత ఫలితాలపై దేశ వ్యాప్త చర్చ.

` అందుకే బిజేపి యేతర పార్టీల ఐక్యత కేసిఆర్‌ తోనే సాధ్యం. 

`ఖమ్మం నుంచే బిఆర్‌ఎస్‌ శంఖారావం.

` బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే…

`బిజేపికి వణుకు మొదలైంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. ఈ రోజు అద్భుతమైన ఘట్టం ఆవిష్కరింపబడుతోంది. దేశంలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించనున్న బిఆర్‌ఎస్‌ సభ గురించే దేశమంతా చర్చిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో బిజేపికి వ్యతిరేకంగా ఇలాంటి సభ జరగలేదు. బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే వేధిక ఏర్పాటు కాలేదు. అది తెలంగాణ కూడా తెలంగాణ నుంచి ఏర్పాటు కావడం శుభసూచకం. బిఆర్‌ఎస్‌ సభ చరిత్ర సృష్టిస్తుంది. కేసిఆర్‌ నాయకత్వం దేశానికి దిశా నిర్దేశం చేసే తరుణం ఆసన్నమైందంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావుతో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు… స్పెషల్‌ డిస్కషన్‌…హరీష్‌ రావు మాటల్లో…

ప్రజల గురించి తెలిసిన నాయకుడే వాళ్లను అర్థం చేసుకుంటాడు.

 వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తాడు. వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాడు. కొత్త తరం ఆవిష్కరణలు చేస్తాడు. ప్రజలు పడే ఇబ్బందులకు చలించిపోతాడు. ప్రజల కష్టాలకు మార్గం అన్వేషిస్తాడు…అలా తెలంగాణ గోసను చూసి, తెలంగాణ సమాజం పడుతున్న వెతలు చూసి ఆనాడు చలించిన నేత కేసిఆర్‌… తెలంగాణ సాధించి ప్రజలకు బహుమానంగా ఇచ్చాడు. తెలంగాణ అభివృద్ధి బంగారు తెలంగాణ కు బాటలు వేశాడు. తెలంగాణ సస్యశ్యామలం చేశాడు. అన్ని రంగాలలో తెలంగాణ ను ముందుంచాడు. ప్రగతికి తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌ చేశాడు. సంక్షేమ సారధిగా మన్ననలు అందుకుంటున్నాడు. తెలంగాణ అభివృద్ధి దేశమంతా కావాలని ప్రజలే అడిగేలా చేస్తున్నాడు…అదీ కేసిఆర్‌ అంటే…అదీ నాయకుడంటే…చరిత్ర తిరగ రాయాలన్నా కేసిఆరే… చరిత్ర సృష్టించాలన్నా కేసిఆరే…చరిత్ర గతిని మార్చాలన్నా కేసిఆరే..!

బిజేపి అసమర్థ విధానాలపై దేశమంతా రాజకీయ పార్టీల తిరుగుబావుటా ఎగురవేస్తున్నాయని చెప్పడానికి ఖమ్మంలో జరిగే బిఆర్‌ఎస్‌ సభ నిదర్శనం. …

దేశంలో వున్న అనేక రాజకీయ పార్టీలు బిజేపి అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇతర రాజకీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేసి, బిజేపి తిరుగులేని శక్తిగా మారాలని చూస్తోంది. మరో వైపు తీవ్ర ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. బిజేపి ఎనిమిదేళ్ల పాలనలో దేశంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ఏ ఒక్క రాష్ట్రం, ఓ ఒక్క ప్రాంతం కూడా సంతోషంగా లేదు. పూర్తిగా బిజేపి ఆధిపత్య రాజకీయాల కోసం తప్ప ప్రజా సంక్షేమ రాజకీయాలు వదిలేసింది. 

ఖమ్మం సభతోనే బిఆర్‌ఎస్‌ సక్సెస్‌. 

దేశంలో ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్‌ ఖమ్మం సభ రాజకీయాలలో అపురూప ఘట్టం. ఖమ్మం సభ వేధికగా బిఆర్‌ఎస్‌ శంఖారావం పూరిస్తోంది. బిజేపిని గద్దె దించడమే లక్ష్యంగా బిజేపి యేతర పార్టీలను కూడగట్టడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సఫలీకృతులయ్యారు. బిఆర్‌ఎస్‌ దేశ రాజకీయాలలో సంచలనం నమోదు చేస్తుంది. ఎనిమిదేళ్లలో తెలంగాణ అనేక అధ్భుతాలు ఆవిషృతమయ్యాయి. తెలంగాణ సాధించుకున్నాక జరిగిన అభివృద్ధిని చూసి దేశమే అబ్బురపడుతోంది. మా రాష్ట్రాలలో కేసిఆర్‌ లాంటి నాయకుల నాయకత్వాలు వుంటే బాగుండు అనుకుంటున్నారు. తెలంగాణ లో అమలౌతున్న సంక్షేమ పథకాలు మా రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. అందుకే బిఆర్‌ఎస్‌ తో కలిసి నడిచేందుకు దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయి.

టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, బిఆర్‌ఎస్‌ తొలి సభ నా పర్యవేక్షణలో జరగడం అదృష్టం.

 కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తుకున్న నాడు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఆనాటి తొలి సభ ఏర్పాట్లు నా పర్యవేక్షణలోనే జరిగాయి. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ తొలి సభ ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాకే అప్పగించారు. అందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సభల నిర్వహణ బాధ్యతలు నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఒకే వేధిక మీద ఐదారు జాతీయ పార్టీలు. 

ముఖ్యమంత్రులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సందర్భం లేదు. చాలా కాలం తర్వాత ఒక చారిత్రక ఘట్టం ఆవిషృతం కానున్నది. ఒకే వేదికపై ఐదారు జాతీయ రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు వేధిక పంచుకోవడం అంటేనే బిజేపి పతనం ఇక్కడి నుంచే మొదలైనట్లు లెక్క. అందరూ కలిసి బిజేపి వ్యతిరేఖ గళంతోపాటు, భవిష్యత్తు దేశ అవసరాలు, ప్రజా సంక్షేమం పై ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. బిఆర్‌ఎస్‌ కు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి సంఫీుభావం తెలియజేసేందుకు వస్తున్నారు. ఇంతకన్నా గొప్ప సందర్భం ఇటీవల కాలంలో లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ప్రభావితమయ్యాయి. కేంద్రం నుంచి కనీస సహకారం లేకున్నా ఎమనిదేళ్లలో అద్భుతాలు సృష్టించిన కేసిఆర్‌ దేశానికి ప్రధాని అయితే ఈ పథకాలన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేయగలరనే నమ్మకం వారిలో కలిగింది. అందుకే కదలివస్తున్నారు. ప్రజలు తరలిరానున్నారు. ఇటీవల కాలంలో అరుదైన ఘట్టం. కేసిఆర్‌ నాయకత్వంతోనే ఇదంతా సాధ్యమౌతోంది. ఇలా అన్ని రాజకీయ పార్టీలను 

బిజేపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ విఫలం.

 దేశంలో కాంగ్రెస్‌ పార్టీ నానాటికీ ప్రాభవం కోల్పోతోంది. ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమౌతోంది. బిజేపి అరాచక పాలనపై దేశమంతా వ్యతిరేకత కనిపిస్తున్నా కాంగ్రెస్‌ ప్రజలకు చేరువకాలేకపోవడం మూలంగా బిజేపి ఒంటెద్దుపోకడలు పోతోంది. బిజేపి చెప్పిందొకటి చేస్తున్నదొకటి. దేశంలో ఏటా రెండు లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో నింపాల్సిన ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పైగా వాటన్నింటినీ ప్రైవేటు పరం చేయడం జరుగుతోంది. 

వ్యవసాయ రంగాన్ని బిజేపి కేంద్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.

 దేశంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు తెస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన బిజేపి ఆది నుంచి రైతు వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోంది. రైతును గోస పెడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం. బిజేపి పాలనలో సామాన్యుడు నలిగిపోతున్నాడు. 

తెలంగాణకు బిజేపి తీరని అన్యాయం చేసింది.

 రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేయలేదు. జాతీయ ప్రాజెక్టులు తమ విధానంలో లేవని చెప్పి, బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని ఎన్ని సార్లు అడిగినా ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కుదరదన్నారు. గిరిజన యూనివర్శిటీ ఇవ్వలేదు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌ కు తరలించుకుపోయారు. ఐటిఐఆర్‌ ఇవ్వలేదు. తెలంగాణ కు బిజేపి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 

ఎనమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అధ్భుత ఫలితాలపై దేశ వ్యాప్త చర్చ. అందుకే బిజేపి యేతర పార్టీల ఐక్యత కేసిఆర్‌ తోనే సాధ్యం. 

ఖమ్మం నుంచే బిఆర్‌ఎస్‌ శంఖారావం. బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే…దేశంలో బిజేపికి ప్రత్యామ్నాయ శక్తి అవసరం వచ్చింది. దేశ ప్రజలు బిజేపి పాలనలో ఆగమౌతున్నారు. ముఖ్యంగా రైతాంగం అనేక బాధలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అదను చూసి అమలు చేసేందుకు కాచుకొని కూర్చున్నది. అలాంటి దుర్మార్గమైన చట్టాలు దేశ రైతులకు గుది బండలు కావొద్దంటే ప్రజలు బిఆర్‌ఎస్‌ ను అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రజలు ఎంతో విజ్ఞులు. దేశంలో ఏం జరుగుతుందో గమనిస్తూనే వుంటారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బిజేపిని ఇంటికి పంపాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ వారికి ఆశా కిరణంగా కనిపిస్తోంది. అందుకే దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా బిఆర్‌ఎస్‌ కలిసి నడవాలని అనుకుంటున్నాయి. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం. 

బిజేపికి వణుకు మొదలైంది.

 తెలంగాణలో ఉద్యమం మొదలుపెట్టిన నాడు ఎంతో మంది ఎన్నో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వాలు అనేక నిర్భందాలను కూడా పెట్టింది. ఇప్పుడు కూడా బిజేపి చేస్తున్న అరాచకం మన కళ్లముందు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తుందో చూస్తూనే వున్నాం. బిఆర్‌ఎస్‌ ను ఎలాగైనా నిలువరించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఐటి, ఈడిలను వినియోగిస్తున్నారు. భయపెట్టిస్తున్నారు. కానీ ఇలాంటి ఎన్నో చూసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌ బిజేపి దుష్ట పన్నాగాలకు భయపడతాడా? అనుకున్న లక్ష్యం సాధించకుండా కేసిఆర్‌ ఎప్పుడూ నిష్క్రమించలేదు. విశ్రమించలేదు. విస్మరించలేదు. విరామం తీసుకోలేదు. అలుపెరగని పోరాటం చేయడంలో కేసిఆర్‌ తర్వాతే ఎవరైనా… అది బిజేపి నేతలకు అర్థమయ్యే రోజులు దగ్గరలోనే వున్నాయి. కేసిఆర్‌ రాజకీయ చాణక్యం ఎంత గొప్పదో త్వరలోనే చూస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!