
#మండలంలో ప్రతిపక్ష పార్టీల ఖాళీ.
#ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా.
#ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరొకసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క కార్యకర్తను తమ కుటుంబ సభ్యులుగా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మండలంలోని మేడపల్లి, బుచ్చిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి పలువురు పెద్ది సమక్షంలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కార్యక్రమంలో మండల నాయకులు, క్లస్టర్ ఇంచార్జిలు తదితరులు ఉన్నారు.