పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
డిసెంబర్ 23 న నిర్వహించ బడుతున్న సింగరేణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి వనం రుద్రంపూర్ నందు నిర్వహించు వేడుకల కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించి, అధికారులకు మరియు సిబ్బందికి సలహాలను, సూచనలను ఇచ్చి, పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించినారు. అదే విధంగా రేపు సాయంత్రము జరుగబోవు సంస్కృతిక కార్యక్రమాలకు అధిక సంఖ్యలో ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని రోజు వారి ఒత్తిడి నుండి ఆట విడుపు పొందాలని కోరారు. వీరితో పాటు కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ హాజరు అయినారు.
ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ , కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ ఎస్. ఓ. టు జి. ఎం. ఆర్. నారాయణ రావు, ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ, డి.జి.ఎం. ఆర్.సి.హెచ్.పి. వెంకటేశ్వర్లు, ఎం. వి. టి.సి. మేనేజర్ శర్మ, సీనియర్ పి.ఓ. లు మజ్జి మురలి, జి. సుధాకర్, ఎం. శ్రావణ్ కుమార్, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, రుద్రంపూర్ దిస్పెంసరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరశురాములు, ఐ. టి. మేనేజర్ నాగ దీపా, గోపు కుమార్, సకినాల సమ్మయ్య, నిమ్మల రాజు , కుమార్, సివిల్ డిపార్ట్మెంట్, ఎలెట్రికల్ అధికారులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు.