పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పని సరి; సర్పంచ్ తుంగని సమ్మయ్య యాదవ్.

ముత్తారం :- నేటి ధాత్రి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి అని సర్పంచ్ సమ్మయ్య యాదవ్ అన్నారు. బుధవారం పశు వైద్యశాల డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో
ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి సర్పంచ్ సమ్మయ్య యాదవ్, ఎంపిటిసి గీతారాణి బాలాజీలు ముఖ్య అతిథిగా పాల్గొని టీకాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తుంగని సమ్మయ్య యాదవ్ మాట్లాడుతూ మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాయని వర్షాకాలంలో పరిసరాలు, వాతావరణం కలుషితం అవుతుందని, తద్వారా పశువులకు వ్యాధులు సంక్రమిస్తాయని పేర్కొన్నారు. వైరస్‌ ప్రభావంతో గాలికుంటు వ్యాధి సంక్రమిస్తుందని, నోరు, గిట్టల మధ్య బొబ్బలు నోటి నుంచి చొంగ కారడం ఈ వ్యాధి లక్షణాలు అని అన్నారు. ఈ వ్యాధి పశువులకు సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుందని చెప్పారు. రైతులందరూ పశువులకు టీకాలు వేయించాలని సర్పంచ్ సమ్మన్న గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమం లో అశోక్, గోపాల మిత్రులు, పశుమిత్రలు తోపాటు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!