https://epaper.netidhatri.com/
దాడులు చేస్తామని హెచ్చరికలు.
మెదక్ స్టాపర్ ను అంతు చూస్తామని వార్నింగులు.
వార్తలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వ్యాఖ్యలు.
నేటిధాత్రి ఎడిటర్ ఎక్కడుంటే అక్కడి వెళ్ళి మేమేంటో చూపిస్తాం!
మైనంపల్లి పై మెదక్ జర్నలిస్టులు కేసు నమోదు.
జర్నలిస్టుల జోలికొస్తే మైనం తీస్తామని జర్నలిస్టు ప్రతినిధులు.
జర్నలిస్టులను బెదిరించడం ఫ్యాషన్ అయిపోయింది.
నేటిధాత్రి కి జర్నలిస్టుల సంఘీభావం.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు, మెదక్ రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడ్డుతున్నారు. మైనంపల్లి మీద వార్తలు రాయడానికి ఎంత దమ్ము, మీ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని వెంబడించి, వేటాడుతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఎక్కడున్నా వచ్చి, దాడులు చేస్తామంటున్నారు. మైనంపల్లి హనుమంతరావు జోలికి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేస్తామంటున్నారు. తన అనుచరులను మరింత ఉసిగొల్పే విధంగా తిరుమల దేవదేవుని సన్నిధిలో వుండి చెబుతున్నా…నన్ను టచ్ చేసిన వారిని వదిలిపెట్టనని మైనంపల్లి మాట్లాడుతున్నారు. ఇలా హింసను ప్రోత్సాహించేలా మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. పత్రికలలో తమకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు వచ్చినప్పుడు ఖండించుకునే అవకాశం వుంది. అయినా ప్రజాస్వామ్య చరిత్రలో మీడియాపై దాడులు చేసిన వాళ్లెంతో మంది చరిత్ర హీనులయ్యారు.
మైనంపల్లి హనుమంతరావు లాంటి బెదిరింపులు నేటిధాత్రికి కొత్త కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి బెదిరింపులు, అడ్డగింపులు, దాడులు, చివరికి కేసులు కూడా ఎదుర్కొన్న ఉద్యమ చరిత్ర నేటిధాత్రి సొంతం. ఉమ్మడి రాష్ట్రంలో నేటిధాత్రి అంతు చూస్తామని బెదిరించిన వాళ్లే, తెలంగాణ వదిలిపోవాల్సి వచ్చింది. అలాంటిది తెలంగాణలో నేటిధాత్రికి బెదిరింపుల వారి రాజకీయ సమాధికి సంకేతాలు. తెలంగాణ ఉద్యమ కారుడైన మంత్రి హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేయడం సమంజసమైన విషయం కాదు. పైగా తెలంగాణ ఉద్యమ కారురాలు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సీటు కోసం మైనంపల్లి వ్యాఖ్యలు ఎవరూ సమర్థించరు. అది కుండబద్దలు కట్టినట్లు నేటిధాత్రి చెప్పింది. అందుకోసం నేటిధాత్రి యంత్రాంగాన్ని హెచ్చరించి ఆనందం పొందుదామనుకుంటున్నారు. అది జరగని పని. ఇక వార్తలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మైనంపల్లి అనుచరులు హుకూం జారీ చేయగానే నేటిధాత్రి అక్షరాలు తడబడతాయనుకుంటే పొరపాటు. నేటిధాత్రి అనే పత్రికే అక్షర విప్లవం. నింగిలోకి నిప్పులు విరజిమ్ముకుంటే ఎగిరే రాకెట్ లాంటి అక్షర గాండీవాలు నేటిధాత్రి నుంచి దూసుకొస్తాయి. తట్టుకోలేరు. ఉడుత ఊపులు మానుకోండి. మంత్రి హరీష్ రావు కు క్షమాపణ చెప్పి, తప్పును సరిదిద్దుకోండి. ఇదే నేటిధాత్రి సలహా…