టిఆర్ఎస్ కే మా ఓటు.
నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం.
దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
మేం టిఆర్ఎస్ కే ఓట్లు వేస్తాం…మా కుటుంబ సభ్యులందరి ఓట్లు టిఆర్ఎస్ కే అని మర్రిగూడ మండలానికి చెందిన నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా టిఆర్ఎస్ కే అని ప్రకటించారు. నర్సంపేట గ్రామంలో వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్సం పేట గ్రామ టిఆర్ఎస్ ఇంచార్జ్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి తో కలిసి దివ్యాంగులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రకరకాల కారణాలతో దివ్యాంగులైతే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం పాలకుల శాపంతో ఈ ప్రాంత ప్రజలు దివ్యాంగులయ్యారని అన్నారు. గతంలో ఇక్కడ ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కాళ్లు, చేతులు వంకర పోయి దివ్యాంగులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం ఎంతో మంది ఫ్లోరోసిస్ బారిన పడి అర్థాంతరంగా తనువు చాలించేవారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతనికి సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆక్షేపించారు. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత,నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ ప్రాంతంలో పర్యటించి పోరుబాట సాగించారని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆనాడే హామీ ఇచ్చారని ఆయన అన్నారు. నాడు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో మునుగోడులో ఫ్లోరోసిస్ మహమ్మారి అంతమైందన్నారు. మిషన్ భగీరథ నీళ్ళతో మునుగోడును ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ విషయంపై సాక్షాత్తు లోకసభలో బీజేపీ పార్టీకి చెందిన మంత్రి రామ్ లాల్ కటారియాగారే ఒప్పుకున్నారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం టివిసిసి చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3016/- పింఛను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పారు. ఒక్క పెన్షన్ నే కాకుండా అనేక సహాయ ఉపకరణాల సైతం ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. సబ్సిడీ రుణాలను ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో 2018 లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధి ని పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేశారని ఎద్దేవా చేశారు.అభివృద్ధి చేయడం చేతకాక ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్న అతను రాజీనామా చేసి తిరిగి అదే పార్టీ నుండి పోటీ చేయకుండా మళ్లీ మరొక ప్రతిపక్ష ఎమ్మెల్యే గా పోటీచేస్తుండడం విడ్డూరమన్నారు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని మీ మీ ఓట్లన్నీ కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాడుగుల దశరథ, గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కల వెంకటేష్, వికలాంగుల ప్రతినిధులు లక్ష్మయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.