స్నేహమంటే ఇదేరా
నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రానికి చెందిన మారం రాజు, సొంగ రాజు,ధర్మారం గ్రామానికి చెందిన కొక్కిస రమేష్ లకు ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఉండడంతో విషయం తెలుసుకున్న 2007 పదో తరగతి బ్యాచ్ తోటి మిత్రులు కలిసి ఇరువురి స్వగృహానికి వెళ్లి పరామర్శించి, ఆధైర్యపడవద్దని,ధైర్యంగా ఉండాలని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని ఇరువురికి ఆర్థిక సహాయాన్ని అందించామాన్ని ఎస్ఎస్స్సి 2007 బ్యాచ్ మిత్రులు తెలిపారు.వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మిత్రులకు మేం అండగా ఉంటాం.తోబుట్టువుల ఆదుకుంటామని,కష్టాలలో ఉన్న మిత్రులకు భరోసాగా అండగా ఉంటామని, ఒకరినొకరికి సహయసహ కారాలు అందజేసుకుంటామని స్నేహమంటేనే ఒకరినొకరికి సాయం అందిపుచ్చుకోవడం అని స్నేహానికి హెచ్చుతగ్గులు ఉండవని,బాధలో ఉన్న మిత్రులకు సహాయం చేస్తూ, వారి కళ్ళల్లో ఆనందం చూడడం ముఖ్యమని స్నేహానికి మించిన ఆనందం వేరే మరొకటి లేదని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి 2007బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.