ప్రతాపరుద్రుడికే తప్పలేదు
` నువ్వెంత…నీ బతుకెంత?
` సమ్మక్క దైవాంశ సంభూతురాలు
` జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్లే….మేడరాజుకు సమ్మక్క అడవిలో కనిపించింది
` పుట్టిన ఆనవాలు…మరణించారనడానికి సాక్ష్యం లేదు
` పసిపాపగా పులుల కావలి…తర్వాత కుంకుమ భరణిగా చరిత్రకారిణి!
` అదీ సమ్మక్క మహిమ…ఇకనైనా తప్పు తెలుసుకో…
` తప్పైందని వేడుకో….!
` కాదూ…కూడదనకుంటే తెలంగాణ సమాజ ఆగ్రహానికి గురికాకతప్పదు?: దళిత సంఘాల హెచ్చరిక
` చినజీయరా…ఇప్పటికైనా కనువిప్పు కలగపోతే కష్టం!
` తల్లులకు క్షమాపణ చెప్పకపోతే మరింత నష్టం
` ఆదివాసీలలో మరింత ఆగ్రహం పెరిగితే మునిగేది ముచ్చింతలే..?
హైదరాబాద్ , నేటిధాత్రి :
సమ్మక్క రాజ్యం మీద దండెత్తిన కాకతీయ ప్రతాపరుద్రుడికే పతనం తప్పలేదు. నువ్వెంత…నీ బతుకెంత అని దళిత, గిరిజన సంఘాలు చినజీయరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చినజీయరుడు నమ్మకం ప్రకారం శపిస్తున్నాయి. ఇప్పటికైనా అమ్మను శరణాగతి కోరుకోకపోతే అథోగతే అని దళిత, గిరిజన సంఘాలు సూచిస్తున్నాయి! హెచ్చిరిస్తున్నాయి. ప్రజారంజక పాలకులుగా చరిత్రకెక్కిన కాకతీయుల వంశంలో రెండో ప్రతాపరుద్రుడు క్రూరుడై, సామంతులపై సమరం ప్రకటించాడు. అదే సమయంలో ఆదివాసుల సామంత రాజ్యానికి రాణిగా ఉన్న సమ్మక్క దేవత కాకతీయులను తరిమి తరిమి వేటాడిరది. కాకతీయుల సైన్యం కదన రంగం విడిచి పారిపోయేలా చేసింది. కాకతీయ సైన్యం హాహాకారాలతో వెనుదిరిగేలా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. వీర వనితగా తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకున్నది. తన రాజ్యం నాశనం చేయాలని చూసిన ప్రతాపరుద్రుడి తర్వాత కాకతీయ వంశం లేకుండా చేసింది. అదీ సమ్మక్క తల్లి మహత్యం. భవిష్యత్ కాలానికి తన అభయాన్ని అందిస్తూ అదృష్యమై, కుంకుమ భఱిణ రూపంలో కరుణించింది. నాటి నుంచి పూజలందుకుంటోంది. రెండేళ్లకోసారి జాతర రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. మేడరాజు రాజ్యాన్ని, సమ్మక్క భర్త, కూతురు సారలమ్మ, కొడుకు జంపన్నల మరణానికి కారణమైన కాకతీయ వంశం అంతటితో సమాప్తం చేసింది. కాకతీయ రెండో ప్రతాపరుద్రుడు డిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సేనల వశమై, బంధీ అయ్యి, నర్మదా నదిలో దూకి చనిపోయాడు. సమ్మక్క కుమారుడైన జంపన్న సంపెంగ వాగులో ఎలా దూకి ఆత్మ హత్య చేసుకోవాల్సివచ్చిందో అదే శిక్ష ప్రతాపరుద్రుడు కూడా అనుభవించాడు. ఇది కథ కాదు నిజం. చిరిత్ర లిఖించుకున్న యాధార్ధ సంఘటన. అసలు తెలంగాణ అంటే ఏమిటో తెలియకుండా ఈ ప్రాంత గాలి పీలుస్తూ, నీరు తాగుతూ సమ్మక్కను దూషించి బతికి బట్టకట్టడం అసాధ్యం. తెలిసో తెలియక చేసిన వాఖ్యలు అని అందరూ అనుకుంటున్న సమయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్ధించుకుంటున్న చిన్న జీయరుడు ఇప్పటికైనా సమ్మక్క చరిత్ర తెలుసుకోవాలి. తప్పైందని సమ్మక్క తల్లిని వేడుకోవాలి. తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పుకోవాలని ఆదివాసీ వారసులు డిమాండ్ చేస్తున్నారు.
సమ్మక్క, సారక్క అనే ఇద్దరు మహిమాన్విత మూర్తులకు గుడి లేదు. ప్రహారీ కూడా లేదు. వున్నవి రెండు గద్దెలు. అమ్మల ప్రతిరూపాల్లో రెండు కొయ్యలు. పవిత్రకు ఆనవాళ్లు. రెండేళ్లకోసారి కుంకుమ భరిణ రూపంలో నిజదర్శనాలు. అందుకు పెద్ద, పేద, బీద, బిక్కి అన్న తేడా లేదు. అందరూ సమానమే. కులం, మతం అడ్డు రాదు. నమ్మేవాళ్లందరికీ ఆ అమ్మలు కొంగు బంగారమే…వాళ్లుకు ప్రీతికరమైంది బెల్లమే. అమ్మవార్ల కరుణాకటాక్షాల కోసం ఊళ్లన్నీ ఇంటికి తాలాలు వేసి, అడవి బాట పట్టడమే…ఇంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు సమ్మక్క సారలమ్మ జాతరకు దారులే… అక్కడో గంట లేదు. దర్శనాలకు టిక్కెట్లు లేవు. అలాంటి పవిత్రమైన చోటును గూర్చి అల్పెపు మాటలు మాట్లాడిన చినజీయరుడు తన పాపపంకిలమైన నోరును పాపపక్షాలన చేసుకోవాల్సిందే…
ఆగమం ఏం సూచించింది..నిగమం ఏం నేర్పింది? నిజం ఏం చెప్పింది? అవన్నీ తెలుసని భీరాలు పలికే నీవేం చెబుతున్నావ్…?మత్తులో వున్నావా? గమ్మత్తుగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? సమ్మక్క అదేమిటా? శివ, పార్వతుల గురించి నీచంగా మాట్లాడతావా? నువ్వెంత నీ బతుకెంత? అని చినజీయరుడి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం నిప్పులు చెరుగుతోంది. సృహలో వుండే మాట్లాడుతున్నావా? నిసృహ కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన వ్యాఖ్యలపై ప్రజలే సవరించుకోవాలా? అంత అహంకారమా? తెలిసే మాట్లాడతున్నావా? తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? అని తెలంగాణ సమాజం చినజీయరుడిని నిలబెట్టి కడిగేస్తోంది. నిలువెల్లా విషం నింపుకొని తెలంగాణ గడ్డమీద నిలబడి, తెలంగాణ ఇలవేల్పు సమ్మక్కను దూషించిన చినజీయరుడిని సహించేది లేదని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది.
ఒక తప్పు పది తప్పులు చేయిస్తుంది. తప్పుమీద తప్పు తల రాతను తలకిందులు చేస్తుంది. ఒక అబద్దం వెయ్యి అబద్దాలను మోసకొస్తుంది. బతుకు బజారు పాలు చేస్తుంది. ఇది చినజీయరుడుకి తెలియక కాదు..అహం…అదే మనిషిని విచక్షణ కోల్పేయేలా చేస్తుంది. విజ్ఞతను నశింపజేస్తుంది. అతి ప్రసంగాలకు దారి తీస్తుంది. అందర్నీ తూలనాడేలా చేస్తుంది. అందరూ నాకన్నా తక్కువే అన్న భ్రమల్ని కల్పిస్తుంది. కంటికి పొరలు తెప్పిస్తుంది. కన్నూ, మిన్నూ కానకుండా చేస్తుంది. వినేశ కాలం ముంచుకొచ్చి విపరీత బుద్ధిని ప్రదర్శించేలా చేస్తుంది.
గతంలో తెలిసో, తెలియకో సమ్మక్క`సారక్కల జాతర మీద సరైన అవగాహన లేకనో ఆ వ్యాఖ్యలు చేసి వుండొచ్చు. అప్పుడు నాకు ఎవరైనా తప్పుడు సలహాలిచ్చైనా వుండొద్దు. తెలంగాణ ఉనికి, పరిస్ధితులు, ఆచార వ్యవహారాలపై పూర్తి స్దాయిలో తెలియని తనంతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. తెలంగాణ సమాజం పెద్ద మనసుతో నా అర్ధం చేసుకోండి…తెలియక చేసిన వ్యాఖ్యలకు క్షమించండని ఒక్క మాట మాట్లాడితే పోయేది. అలా కాకుండా తన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజమే సరిదిద్దుకోవాలన్నట్లు మాట్లాడడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. అతన్ని ఉపేక్షించాలని కోరుకోవడం లేదు. సమ్మక్క సారక్క జాతరలో అసాంఫీుక కార్యకాలపాలు సాగుతున్నాయన్న నోటిని చినజీయర్ శుద్ది చేసుకోవాల్సిన అవసరం వుంది. తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాని తప్పుడు కూతలు కూస్తూనే వున్నాడు. తన రోత మాటల్లో తప్పేమీ లేదన్నట్లు మాట్లాడుతున్నాడు.
వింటున్నావా …చూస్తున్నావా రామేశ్వరరావు.ఓ చిన్న మనిషిని తెచ్చి, తనకు తాను పేద్ద మనిషినని భ్రమపడేలా చేసిన అసలు సూత్రదారి, పాత్రదారిగా కళ్లముందు కనిపించే మరో నామాల స్వామి రామేశ్వరరావు ఎక్కడా అని తెలంగాణ జనం ప్రశ్నిస్తోంది? తప్పు చేసేవారే కాదు వారి పక్కన న్నావారు కూడా శిక్షను అనుభవించాల్సిందే… ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ సరిగ్గా లేని వ్యక్తిని తెచ్చి, స్వామిని చేసి, తెలంగాణ ఇలవేల్పులను తూలనాడిన వ్యక్తితో తెలిసే సహవాసం చేశావా? లేక తెలియకుండానే ఇంత కాలం సాగావా? అని రామేశ్వరరావును సైతం తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. కాషాయ దారణలో, సేవా ముసుగులో వున్న సన్యానిని, సర్వసంగ పరిత్యాగి అని భ్రమపడి తెచ్చావా? లేక తిన్నింటి వాసాలు లెక్కబెడతాడాని తెలియక తెచ్చావా? నిన్నటిదాకా వేడుకలన్నీ దగ్గరుండి చేసిన రామేశ్వరరావు, ఎందుకు నోరు విప్పడం లేదన్నది కూడా తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంకా అదే స్వామికి అండగా వుంటావా? లేక దూరం పెడతావా? తెలంగాణ నుంచి ఎక్కడినుంచి పట్టుకొచ్చావో? అక్కడికి పంపిస్తావా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వింటున్నావా? ఎట్టిపరిస్ధితుల్లో చినజీయరుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి, అమ్మవార్లను దర్శించుకొని, తప్పైందని ప్రకటిస్తే తప్ప ఈ వివాదం సమసిపోదు. తెలంగాణ ప్రజలు ఊరికేనే వదిలిపెట్టరు. పంతాలు ప్రజలు మీద ఎవరికీ ఉండొద్దు. ప్రజల ఆగ్రహానికి ఎవరూ గురికావొద్దు.