డబ్బులు ఊరికే రావు!

https://epaper.netidhatri.com/

`గిట్టుబాటు కావాల్సిందే!

పెట్టుబడి రాబట్టాల్సిందే!!

`గాంధీ భవన్‌ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే?

`పిసిసి పదవే రేవంత్‌ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే…

`ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే!

`ఆయారాం…గయారాం!?

`కాంగ్రెస్‌ లో అంతా గందరగోళం!

 

`వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు?

` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు?

` కాంగ్రెస్‌ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు?

` బిజేపి పని అయిపోయిందని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు?

`వచ్చే వాళ్లంతా గాలి వాటం నాయకులే?

`ఒకవేళ వచ్చిన వాళ్లు గెలిచినా, పార్టీ అధికారంలోకి రాకుంటే హాండ్‌ ఇవ్వరన్న గ్యారంటీ లేదు?

`మంచి మంచి నాయకులే కాంగ్రెస్‌ ను వీడారు?

`గర్‌ వాపసీ అని వచ్చే వాళ్లు మళ్ళీ గడప దాటరా?

`టిక్కెట్ల లొల్లి ఆగలేదు?

`టికెట్ల అమ్మకం గోల ఆగడం లేదు?

`కర్ణాటకలో బలమైన నేతలున్నారు…అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తోడైంది.

`తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు.

`కాంగ్రెస్‌ మీద ప్రజలకు సానుభూతి లేదు.

`తెలంగాణలో సీనియర్లున్నారు…బలమైన నాయకులు లేరు?

`వాళ్ల గెలుపుపై వాళ్లకే ఆశలు అంతంత మాత్రం.

`వాళ్లు నలుగురిని గెలిపించడం కష్టం.

`కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం గాలిలో దీపం!

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయంలో కాంగ్రెస్‌ను ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదని ఊరికే అనరు. తనను తాను బతికించుకోవాల్సిన తరుణమైనా సరే, మునిగిపోతున్నా సరే ఓడిరచుకునే విషయంలో వున్నంత పట్టుదల గెలుపులో చూపించుకోరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం వరకు రాజకీయంగా ఎదురులేని సమయంలో గెలుస్తూ వచ్చింది. కాని ఎప్పుడైతే దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావంతో కాంగ్రెస్‌ చతికిల పడడం, లేవడం పరిపాటిగా మారినా, ఇకపై బతికి బట్టకుడుతుందా? లేదా? అన్నది అందరికీ అనుమానమే. అందుకే కాంగ్రెస్‌లో ఎవరు ఎప్పుడు నాయకులౌతారో? అన్నది తెలియకుండాపోయింది. ఎవరు కాంగ్రెస్‌ను కాపాడతారో? అన్న ఎదురుచూపులు మిగులుతున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్‌ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి ఆడిరది ఆట పాడిరది పాటౌతుంది. రేవంత్‌కు రాజకీయం ఆట విడుపుగా మారితే, సీనియర్లకు రాజకీయ సంకటం మొదలైంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఆ మాత్రం మిగిలి వున్న కాంగ్రెస్‌ను రేవంత్‌ పూర్తిగా మింగేయడం ఖాయమని అందరూ చెబుతున్నమాటే. రేవంత్‌ చేరిన నాటి నుంచి అదే మాట చెబుతున్నారు. అదే బాటలో కాంగ్రెస్‌ సాగుతోంది. పాత కాపులు నిలబెట్టింది లేదు. కొత్త కాపు ఉద్దరిచ్చింది లేదు? అన్న సామెతలాగా కాంగ్రెస్‌ పరిసి ్ధతి మారిపోయింది. రేవంత్‌ను ముందు పెట్టి అధిష్టానం ఆట ఆడుతోంది. రేవంత్‌ను విమర్శిస్తూ సీనియర్లు గోల చేస్తున్నారు. ఇక్కడ దేనికీ సింక్‌ కావడం లేదు. అధిష్టానం రేవంత్‌ను ఎందుకు ఎందుకు అంత గడ్డిగా నమ్ముతుందన్నదానిపై ఎవరికీ సష్టత లేదు. సీనియర్ల మాట ఎందుకు కాదంటున్నారన్నదానిపై ఎక్కడా వివరణ లేదు. కాని పాము, ముంగీస ఆటలు సాగుతున్నాయి. ఎవరి బలం ఎంత అన్నది మాత్రం తెలియకుండాపోయినా రేవంత్‌ పెత్తనం మాత్రమే పైకి కనిపిస్తోంది. గత ఆరు నెలల కాలంగా రేవంత్‌రెడ్డి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ షురూ చేసిండన్న సంగతి అందరికీ తెలుసు. ఒక్కొ నియోజకవర్గంలో ఒకరిద్దరికి పైగా అశావహులను లైన్లో పెట్టిండని తెలుసు. ఆనాడు మాత్రం ఏ సీనియర్‌ మాట్లాడలేదు. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటుండు అన్న ప్రచారం సాగిస్తున్నారు. అంతే తమకంటే పరోక్షంగా రేవంత్‌ అతి బలవంతుడని ఒప్పుకున్నట్లౌతుందన్నది తెలుసుకోలేకపోతున్నారు.
రేవంత్‌ రెడ్డి ఎలా పిసిసి. అధ్యక్షుడు అయ్యారన్నదానిపై ఎవరి లెక్కలు వారికి వున్నాయి.
ఎందుకంటే స్వతాహాగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌వాది కాదు. పచ్చి కాంగ్రెస్‌ వ్యతిరేకి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర నుంచి రాష్ట్ర స్ధాయి నేతలను ఎవరినీ వదిలిపెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు. అలాంటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆశ్చర్యకరమైన విషయం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు అనేది నానుడే అయినా, తిట్టిన కాంగ్రెస్‌లో నాయకుడు కావడం వేరు. కాంగ్రెస్‌కే నాయకుడు కావడం వేరు. కాని రేవంత్‌రెడ్డి ఏకంగా పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు. రేవంత్‌ తిట్టిన తిట్లు విన్న నేతలు ఇప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఇదే రాజకీయం అంటే ఇంత వరకు బాగానే వుంది. ఇప్పుడు రేవంత్‌ టిక్కెట్టకు పెద్దఎత్తున డబ్బులు తీసుకుంటున్నాడని అంటున్న కాంగ్రెస్‌ నేతులు గతంలో రేవంత్‌ రెడ్డి కోట్లు పెట్టి పిసిసి. పదవి కొనుక్కున్నాడంటూ ఆరోపణలు చేశారు. అంటే కాంగ్రెస్‌లో పదవులు కావాలంటే అడిగినంత సమర్పించుకోవాల్సిందే అన్నది సీనియర్లే నేర్పినట్లైంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్‌ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పిసిసి. అధ్యక్షుడు అయ్యాడు అన్న మాటలు చెప్పిందే…తెలంగాణ ప్రజలు విన్నదే…ఇప్పుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్టు అమ్ముకుంటున్నాడన్న మాట మాట్లాడే అర్హత వారికి వుందా? డబ్బులు ఊరికే ఎవరికీ రావు..ఆనాడు పెట్టిన డబ్బు రేవంత్‌ తిరిగి ఎలా సంపాదించుకోవాలన్నదానిపై లెక్కలుండవా? మిగతా నాయకుల డబ్బులు మాత్రమే , డబ్బులా? రేవంత్‌ పెట్టిన ఖర్చుకు లెక్కుండొద్దా? పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నా గాంధీ భవన్‌ బాగు చేసుకోలేకపోయారు? కొత్త గాంధీభవన్‌ కట్టుకోలేకపోయారు? కొన్నేళ్ల తర్వాత గాంధీభవన్‌ కు కొత్త కళ తెచ్చింది రేవంత్‌రెడ్డి కాదా? ఆయన పిసిసి. అధ్యక్షుడు అయ్యాకే కొత్త కొత్త రంగులు వేయలేదా? లోపల అంతా ముస్తాబు చేయలేదా? అందుకు రేవంత్‌కు ఖర్చు కాలేదా? అదంతా తిరిగి రాబట్టుకోవద్దా? గాంధీ భవన్‌కు వేసిన సున్నాల సొమ్ముతో సహా పెట్టిందంతా రాబట్టుకోవాల్సిందే….ఆ ఖర్చు జమా ఖర్చులో వేసుకోవాల్సిందే…కాదనే అధికారం..అర్హత ఎవరికీ లేదు. కాంగ్రెస్‌ చేసుకునే స్వయంకృతాపరధాంలో ఎప్పుడూ సెల్ప్‌ గోల్‌ చేసుకోవడం అలవాటే…
నిజంగా కాంగ్రెస్‌కు చిత్త శుద్ది వుంటే రేవంత్‌ను మించిన నాయకుడే కాంగ్రెస్‌లో దొరకలేదా?
అంటే ఔననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వస్తే నేనే సిఎం. అన్న నాయకులు అనేక మంది. ఇప్పటికీ ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సిఎం అంటూ ఇంకా కలలు కంటున్నవాళ్లు ఏం తక్కువ లేరు. కాని పార్టీని కాపాడుదాం..నిలబెడదాం…ముందుండి నడుద్దాం…పార్టీని రక్షించుకుందా…కష్టపడి అధికారంలోకి తీసుకొద్దామన్న ఆలోచన వున్న నాయకులు ఎంత మంది వున్నారు. తెలంగాణ రాగానే నాకు పిసిసి కావాలంటూ కోరి మరీ అధ్యక్షుడు అయిన పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీని నడపడం నావల్ల కాదని వదిలేశాడు. నేను వుండలేనంటూ పార్టీకి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాడు. కాని ఏం లాభం? అతి బలవంతంగా పిపిసి. అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆఖరుకు ఇక నా వల్లకాదంటూ ఆయనకూడా కుర్చీ దిగిపోయాడు. ఆ తర్వాత పిసిసి. నాకే కావాలని కొట్లాడిన వారు లేరు. ఇస్తే తప్ప తీసుకోము అన్నట్లు మాట్లాడినవారే ఎక్కువ. సీనియర్లు బలంగా వుంటే రేవంత్‌ ఎందుకు పోటీకి వచ్చేవారు…పిసిసి. సీటు ఎలా సాధించేవారు? అయినా కాంగ్రెస్‌నాయకుల్లో ఐక్యత లేదు. రాదు…వస్తుందన్ననమ్మకం ఇప్పటికీ లేదు. సీనియర్లలలోనే తలోదారి నడిచేవారే ఎక్కువ. అందుకే రేవంత్‌రెడ్డిది ఆడిరది ఆట పాడిరది పాటగా మారింది. నిజానికి పొన్నాల లక్ష్మయ్య పిసిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో కాంగ్రెస్‌ అంతో ఇంతో బలంగా వున్నది. కాని పైకి ఎంతో వీక్‌గా కనిపించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడు వున్న సమయంలో కూడా కాంగ్రెస్‌ ఊపు మీదేవుంది. కాని లోన ఏదో వెలితిగా వుండేది. రేవంత్‌ రెడ్డి రాకతో ఎంతో జోష్‌ నిండిరది. లోన మాత్రం అంతా ఖాళీగానే వుంది. రేవంత్‌ పిసిసి. కాకముందు ఉప ఎన్నికల్లో కనీసం ఎంతో కొంత ప్రభావం చూపుతూ వచ్చింది కాంగ్రెస్‌. కాని రేవంత్‌ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉప ఎన్నికలో కూడా కనీసం డిపాజిట్‌కూడా రాకుండాపోయాయి. ఇదీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు పైకి పెంచినట్లు కనిపించినా, గ్రౌండ్‌కు దిగిజార్చిన గ్రాఫ్‌.
ఇదిలా వుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌లో జోష్‌ నింపినట్లు చేసిన రేవంత్‌స్కెచ్‌ మాత్రం ఆయనకు కాసుల పంట పండిస్తోందని అంటున్నారు.
ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కర్నాటకలో బిజేపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ గెలిస్తే, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఊపు రావడం అంటేనే మమ్ములను చూసి ముంత ఒలకబోసుకోవడం…దాన్ని చూసి ఇతర పార్టీలనేతలు కాంగ్రెస్‌కు క్యూకట్టడం..అది రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మారడం…ఒక రకంగా సీనియర్లు చెబుతున్నట్లు ఆదాయవనరుగా మారడం…! ఇంత వరకే రాజకీయం… ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు..కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదు. రేవంత్‌ జేబులు నిండడం తప్ప మరోకటి లేదు…ఈ మాటలంటున్నది ఎవరో కాదు… సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నేతలు..కరిమింగిన వెలగపండు గదరా…రేవంత్‌ తీరు..అంటున్నారు సీనియర్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!