మంచిర్యాల, నేటిధాత్రి:-
మంచిర్యాల నారాయణ ఆసుపత్రి సౌజన్యంతో సెప్టెంబర్ 23న జిల్లా చెస్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మూడవ ర్యాంకింగ్ క్లాసికల్ చదరంగం పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర చదరంగం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి సిరాజ్ ఉర్ రెహమాన్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చదరంగం అభివృద్ధి చైర్మన్ ఈగ కనకయ్య, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సుధాకర్ లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మందమర్రి పట్టణంలోని బురదగూడెం లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాలలో స్విస్ లీగ్ పద్దతిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్ 22 లోపు ఎంట్రీ ఫీజ్ వంద రూపాయలు చెల్లించి, తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. చెస్ క్రీడాకారులు విధిగా తమ చెస్ క్లాక్ తీసుకొని రాగలరని, టోర్నమెంటులో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. ఈసారి పోటీలకు స్పాట్ ఎంట్రీలు లేవని, పోటీలో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్ 23 ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని, అనంతరం మొదటి రౌండ్ పోటీలు ప్రారంభించడం జరుగుతుందని సూచించారు. మరిన్ని వివరాలకు, టోర్నమెంట్ ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు అంబాల కల్పన సెల్ నెంబర్ 8978146456 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.