ఘనంగా మేరా దేశ్ మేరా మాటి కార్యక్రమం

ఘనంగా మేరా దేశ్ మేరా మాటి కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో కిసాన్ మోర్చా రామడుగు మండల అధ్యక్షులు శక్తి కేంద్రం ఇంచార్జ్ ఎడవెల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు నా దేశం నా మట్టి (మేరా దేశ్ మేరా మాటి) ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్ రెడ్డి విచ్చేసి గ్రామంలోని మార్కండేయ దేవాలయంలో పవిత్రమైన మట్టిని సేకరించి అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమానుల నుండి తులసి చెట్టులోని పవిత్రమైన మట్టిని సేకరించారు. ఈసందర్భంగా జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ సేకరించిన మట్టితో ఢిల్లీలో దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన మహానుభావుల కోసం స్మృతివనాన్ని అమృత వాటికను ఏర్పాటు చేస్తారన్నారు. దేశంలోని ప్రజలందరూ దేశభక్తిని పెంపొందించే విధంగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని అదేవిధంగా దేశం కోసం దేశ స్వాతంత్ర్యంలో పోరాడిన మహనీయుల ఆశ సాధనం కోసం అనునిత్యం పనిచేస్తున్నారన్నారు. దేశం కోసం అమరులైన వారికోసం స్మరించుకోవడానికి ఈయొక్క స్మృతివనాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో 93వ బూతు అధ్యక్షులు మంచికట్ల మహేందర్, దుగ్యాల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *